ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు హీరోయిన్స్ కొర‌త ఎక్కువుగానే ఉంటుంది. అయితే ఏ ఇండ‌స్ట్రీలో అయినా హీరోయిన్‌గా న‌టించాలంటే వాళ్ళు ఎక్కడ నుంచి అయినా వ‌స్తారు. ఇత‌ర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి కూడ హీరోయిన్స్‌గా ప‌రిచ‌యం అవుతారు. హీరోయిన్‌గా ఎంట్రి కావడం అనేది పెద్ద స‌వాల్ లాంటిది. నిర్మాత‌లు చెప్పే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ అన్నింటికి ఒప్పుకున్నాక‌, హీరో వ‌ద్ద అనిగిమ‌నిగి ఉండాలి. అన్ని విష‌యాల‌ను ఓకె అన్న త‌రువాత చివ‌ర‌కు ఆమెకే బ‌ద్రత క‌రువ‌వుతుంది. రీసెంట్‌గా మ‌ల్లూవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ హీరోయిన్‌కు సెట్‌లోనే అవ‌మానం జ‌రిగిందని ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. హీరోతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్న హీరోయిన్ ప‌ట్ల చిత్ర ద‌ర్శకుడు అస‌భ్యక‌రంగా మాట్లాడాడు. కొన్ని కారణాల వ‌ల్ల హీరోయిన్ కాస్ట్యూమ్స్‌ను మార్చవ‌ల‌సి ఉంటే, ఆమెను యూనిట్ స‌భ్యుల ముందే త్వర‌గా మార్చుకో అంటూ ఆర్డర్ వేశాడ‌ట‌. దీంతో అక్కడ ఏం జ‌రుగుతుందో కాసేపు ఎవ్వరికి అర్ధం కావ‌డంలేదు. వెంట‌నే హీరోయిన్ త‌ల్లి అక్కడే ఉండ‌టంతో డైరెక్టర్‌పై విరుచుకుప‌డి పెద్ద గొడ‌వ చేసింది. హీరోయిన్ ప‌ట్ల ఆ డైరెక్టర్ ఆ విధంగా మాట్లాడ‌టానికి కార‌ణం హీరోయిన్ మేనేజ‌ర్ కార‌ణ‌మ‌ని త‌రువాత తెలుసుకున్నారు. హీరోయిన్ మేనేజ‌ర్‌, డైరెక్టర్ వ‌ద్ద హీరోయిన్ మీద లేనిపోని విష‌యాలు చెప్పి ఆమెపై బ్యాడ్ ఒపీనియ‌న్‌ను క్రియోట్ చేశాడు. దీంతో ఆ డైరెక్టర్ మినిమం కామ‌న్‌సెన్స్ లేకుండా చిత్ర యూనిట్ స‌భ్యుల ముందు ఆమె ప‌ట్ల అస‌భ్యక‌రంగా ప్రవ‌ర్తించాడు. ఇప్పుడు ఈ ఇష్యూ మ‌ల్లువుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: