ప్రస్తుతం పవన్ క్రేజ్ టాలీవుడ్ ను కుదిపేస్తు ఉంటే పవనిజమ్ క్రేజ్ తో పవర్ స్టార్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు వర్గాలకు అతీతంగా ఉరకలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపు కుడుపుతున్న ఈ పవనిజమ్ పై ఇప్పటికే అనేక పాటలు, డైలాగ్స్ వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈ నేపద్యంలో బుల్లి తెరపై సంచలనం సృష్టిస్తున్న రియాల్టీ షో ‘జబర్దస్త్’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పవనిజమ్ హడావిడి చేయబోతోంది. జబర్దస్త్ కమెడియన్ గా పేరు గాంచిన షకలక శంకర్ పవనిజమ్ పై ఒక పాటపాడి ఆ కార్యక్రమంలో హడావిడి చేయబోతున్నాడు.  ఈ పాట పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన, సినిమాల పేర్లతో ఈ పాత ఉంటుంది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రోడుస్ చేస్తున్న మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ పాటను యూట్యూబ్ లో పెట్టారు. ఈ పాటకు పవన్ అభిమానుల నుంచి విసేషస్పందన వస్తోందని తెలుస్తోంది. షకలక శంకర్ పాడిన పాట ఈ నెల 31వ తారీఖున ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ప్రసారం కాబోతోంది. పవన్ ఆరడుగుల బుల్లెట్ పాట ‘అత్తారింటి’ సినిమాను బ్లాక్ బస్టర్ గా మారిస్తే మరి షకలక శంకర్ పాడిన పాట బుల్లితెర పై మరింకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ట్విస్ట్ ఏమిటంటే ఈ కార్యక్రమంలో సెలెబ్రెటీ గా నాగబాబు ఎప్పటి నుంచో పాల్గొంటున్నాడు మరి తన తమ్ముడు పై వచ్చే పాటను నాగబాబు విని ఈ ‘జబర్దస్త్’ కార్యక్రమంలో ఇంకెంత నవ్వుతాడో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: