నాగార్జున ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అంటారు అతడి గురించి తెలిసినవాళ్లు. అన్ని విషయాల్లోనూ ప్లానింగ్ తో ఉంటాడని, ఆలోచించకుండా అడుగు వేయడని కచ్చితంగా చెబుతారు. కానీ అది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది తరచి చూస్తే. ఇటీవలి కాలంలో తన సినిమాలకు సంబంధించిన విషయాల్లో నాగ్ అన్నీ తప్పుడు నిర్ణయాలే తీసుకున్నాడు. అనవసరమైన ప్రయోగాలకు పోయి, తనకు తగని పాత్రలు చేశాడు. అందువల్లే అతడి నుంచి సక్సెస్ ఆమడ దూరం పారిపోయింది. అలాగే నాగచైతన్య విషయంలో కూడా రాంగ్ స్టెప్ వేశాడు. చైతూది యాక్షన్ సినిమాలకు పనికొచ్చే ఫేస్ కాదు. కాస్త బాడీ ఉన్నా, అతడి ముఖంలో సున్నితత్వం ఉంటుంది. అది గమనించకుండా యాక్షన్ హీరోగా ఎంటర్ చేశాడు. కాలేజీ బ్యాగ్రవుండ్ కథే అయినా, జోష్ లో యాక్షన్ హీరోగానే కనిపిస్తాడు చైతూ. ఏం మాయ చేశావె తప్ప మిగతా అన్ని సినిమాలూ కూడా అలాంటివే ఎంచుకోవడం వల్ల అతడి కెరీర్ గాడి తప్పింది. ఇప్పుడు అఖిల్ ఎంట్రీ విషయంలో కూడా అలాంటి పొరపాటే చేస్తున్నాడేమో అనిపిస్తోంది. నాగార్జున తొలిసారి నిర్మించి చిన్న చిత్రం... ఉయ్యాల జంపాల. ఈ ట్రయిలర్ ఇటీవలే రిలీజై, అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఈ కథను దర్శకుడు వాసు, అఖిల్ కోసం రాసినట్టు సమాచారం. కానీ అంత సాఫ్ట్ లవ్ స్టోరీతో ఎంటర్ చేస్తే, అఖిల్ లవర్ బాయ్ గా ముద్రపడిపోతాడని నాగ్ వద్దన్నాడట. దాంతో వేరే వాళ్లను పెట్టి తీశారు. లవర్ బాయ్ గా ముద్ర పడితే వచ్చిన నష్టమేంటో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎన్టీయార్, రామ్ చరణ్, ప్రభాస్, మహేశ్... వీళ్లంతా యాక్షన్ హీరోలుగా ఏలుతున్నారు. ఇక వీళ్ల మధ్యకి వెళ్లి, వాళ్లు తీసేదే తీసి, పోటీని ఎదుర్కోలేక చతికిలపడే బదులు.... ఓ కొత్త ఇమేజ్ తో ఎంటరై తర్వాత కావాలంటే అలాంటివి ట్రై చేయొచ్చు కదా. పైగా అఖిల్ క్యూట్ గా, సాఫ్ట్ గా కనిపిస్తాడు కూడా. నాగ్ ఏం ఆలోచిస్తున్నాడో, చివరికి అఖిల్ ని ఏం చేస్తాడో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: