దేశవ్యాప్తంగా రిలియన్స్ సంస్థ చేయని వ్యాపారం లేదు ఏ వ్యాపారంలో అయినా చాల తెలివిగా వ్యాపారం చేయడం రిలియన్స్ సంస్కృతి. గత వారం విడుదల అయిన నాగార్జున ‘భాయ్’ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటూ ఈ సినిమా దర్శకుడు వీరభద్రం వరసపెట్టి చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆదరగోడుతూ ఉంటే ఫిలిం నగర్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ నేపధ్యంలో ఒక ఆశక్తికర కధనం ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.  తెలుస్తున్న సమాచారంప్రకారం నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ‘భాయ్’ సినిమాను నిర్మించినా ఈ సినిమాలో నాగార్జున వాటా మటుకు చాలా తక్కువట. మేజర్ షేర్ అంతా రిలేయన్స్ ఎంటర్ టైన్మెంట్ వారిదే అట. మరొక ఆశక్తికర విషయం ఏమిటంటే 40కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున తన పారితోషికంగా భారీమోత్తాన్ని రిలేయన్స్ సంస్థ నుండి అందుకున్నట్లుగా తెలుస్తోంది. విడుదలైన మూడు రోజులలో ఈ సినిమా కేవలం 5 కోట్లు వసూలు చేసి నష్టాల బాట బట్టినా ఈ సినిమా వల్ల నాగార్జునకు పెద్దగా నష్టం రాలేదని, వచ్చిన నష్టం అంతా రిలియన్స్ వారిదే అంటూ మాటలు వినిపిస్తున్నాయి. మరొక విషయం ఏమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వీరబద్రం చౌదరికి మంచి పేరు రాకున్న, కొత్త సినిమాల ఆఫర్లు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనిని బట్టి చూస్తే నాగార్జున తెలివితేటలు వీరబద్రాన్నికి కూడా అబ్బినట్లుగా అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: