టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నిర్మాతలతో ఆడుతున్న గేమ్ ప్లాన్ ఎవరికీ అర్ధంకాక పెద్దపెద్ద నిర్మాతలు కూడా అయోమయంలో పడిపోతున్నారు. పరస పెట్టి వచ్చిన మూడు విజయాలతో ప్రిన్స్ మహేష్ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి అతి చేరువలో ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప మహేష్ కు పోటీ ఇవ్వగల హీరో ఎవరూ ప్రస్తుతం టాలీవుడ్ లో లేరు. యూత్ ఫాలోయింగ్ లో మహేష్ పవన్ కన్నా వెనకబడినా ఫ్యామిలీ ఆడియన్స్, గర్ల్స్, కిడ్స్ ఆడియన్స్ లలో మహేష్ కు స్పష్టమైన ఆధిక్యత ఉంది.  ఈ నేపధ్యంలో మహేష్ డేట్స్ ఇవ్వలేకాని పారితోషికంగా ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ మహేష్ మాత్రం తన మనసులోని మాట బయట పెట్టకుండా ఏ నిర్మాతకు మాట ఇవ్వకుండా ఒకే నిర్మాణ సంస్థకు తన డేట్స్ వరుస పెట్టి ఇచ్చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దూకుడు సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకే మహేష్ నిలయ విద్వాంసుడి గా మారిపోతున్నాడు. ‘దూకుడు’ తరువాత మహేష్ బయట నిర్మాతల సినిమాలను రెండు చేసినా ఆ తరువాత తన డేట్స్ ను అన్నిటినీ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకు ఇచ్చి సంచలనం సృష్టిస్తున్నాడు.  ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘1’ నేనొక్కడినే ఈ మధ్యనే మొదలైన ‘ఆగడు’ ఇదే నిర్మాణ సంస్తవి కావడం విశేషం. ఇవి చాలనట్లు ‘1’ సినిమా విడుదల అయినతరువాత కుటంబ కధా చిత్రాలకు చిరునామాగా ఉండే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సినిమా చేయడానికి ఇదే 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థకు మహేష్ డేట్స్ ఇచ్చాడు అని వినపడుతున్న వార్త టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలకు ఆశ్చర్యంగా ఉండటమే కాకుండా మహేష్ కు ఈ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ లో భాగస్వామ్యం ఉందా అనే విషయం పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఎమైనా ప్రస్తుతం మహేష్ నిర్మాతలతో ఆడుతున్న గేమ్ ప్లాన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: