బాహుబ‌లి మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అయి యూ ట్యూబ్‌లో సంచ‌ల‌నం రేపుతుంటే రాజ‌మౌళి పేరు ఇండియాలో తెగ ప్రచారం అవుతుంది. కేవ‌లం ఫ‌స్ట్‌లుక్‌తోనే ఇండియన్ అప్‌క‌మింగ్ క్రేజీ మూవీస్‌లో బాహుబ‌లి పేరు ఒక‌టిగా చేరిపోయింది. అలాగే ఫ‌స్ట్‌లుక్‌లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడ సంగీత ప్రియుల‌ను మ‌రింతగా ఆక‌ట్టుకొంటుంది. అలాగే ఫ‌స్ట్‌లుక్‌ను చూసిన వారంతా కీర‌వాణి మ్యూజిక్ చాలా బాగుంద‌ని అప్రిషియోట్ చేస్తున్నారు. అలాగే యూ ట్యూబ్‌లో వారం వారం బెస్ట్ ఇండియ‌న్ మ్యూజిక్‌కు సంబంధించిన‌ వివ‌రాల‌ను చెబుతారు. ఈ వారం యూ ట్యూబ్‌లో ఎక్కువ మంది ఇష్టప‌డిన మ్యూజిక్ ట్రాక్ ఏంటంటే అది బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని రిపోర్ట్ ఇచ్చాయి. దీంతో కీర‌వాణి ఆనందానికి అంతేలేదు. ఈ విష‌యంలో రాజ‌మౌళి కూడ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆ ట్రాక్ అంత బాగా రావ‌టానికి కీర‌వాణి ఎంతలా క‌ష్టప‌డ్డాడో వివ‌రించాడు. ఎన్నో ట్రాక్స్‌ను చూసిన త‌రువాత, వాటిపై కీర‌వాణి సంతోషంగా లేడంట‌. ఆ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేయ‌టానికి ముందు రోజు రాత్రి కీర‌వాణి మ‌రో కొత్త ట్రాక్‌ను కంపోజ్ చేశాడు. అదే ఇప్పుడు మ‌నం వింటున్న బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్ వీడియోకు సంబంధించిన మ్యూజిక్‌. రాత్రి ప‌ద‌కొండు గంట‌ల‌కు కూర్చున్న కీర‌వాణి, ఉద‌యం నాలుగు గంట‌ల వ‌ర‌కూ ఆ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. మొత్తానికి బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అయి ఇండియ‌న్ ఫిల్మ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: