మొన్నటి వ‌ర‌కూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మిల్కి బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ త‌మ‌న్న. త‌ను ఎప్పుడైతే బాలీవుడ్‌లో హిమ్మత్‌వాల మూవీలో న‌టించిందో అప్పటి నుండి త‌మ‌న్నకు ఫిల్మ్ కెరీర్ రివ‌ర్స్‌లో న‌డుస్తుంది. త‌మ‌న్న ఏ మూవీలో న‌టించిన ఆ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద అంత‌గా ఆడ‌క‌పోవ‌డం ఒక‌టైతే, ఆ ఎఫెక్ట్‌కి కారణం త‌మ‌న్నానే అంటూ చిత్ర యూనిట్ టార్గెట్ చేస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌ను శాసిస్తున్న స‌మంత‌ను త‌ట్టుకొని త‌మ‌న్నా నిల‌బ‌డాలంటే ఎంతో క‌ష్టప‌డాలి. ముఖ్యంగా ఒకప్పుడు త‌మ‌న్నాను ఇష్టప‌డిన వాళ్ళు, ఇప్పుడు ఆమెకు అంతసీన్ లేద‌ని మొహం మీదే చెప్పేస్తున్నారంట‌. టాలీవుడ్ పెద్దలంద‌రికి త‌మ‌న్నాతో అవ‌స‌రాలు తీరిపోవ‌డంతో ఆమెపై ఇంట్రెస్ట్‌ను కూడ ఈ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంత‌గా చూపించ‌డంలేదు. కోళీవుడ్‌లోనూ త‌మ‌న్నా ప‌రిస్థితి అలాగే ఉంది. అందుకే బాలీవుడ్‌కు పూర్తిగా షిప్ట్ అవ్వాల‌ని త‌మ‌న్నా విశ్వప్రయ‌త్నాల‌ను చేస్తుంది. సౌత్ ఇండ‌స్ట్రీలో వ‌చ్చే ఆఫ‌ర్స్‌ను చేస్తూనే, బాలీవుడ్‌లో ఎక్కువ మూవీలు చేసేందుకు ఆఫ‌ర్లను వెత‌కండి అంటూ త‌న మేనేజ‌ర్లకు కూడ క్లాస్ పీకుతుందుంట‌. త‌మ‌న్నా ఆలోచ‌న‌ల బ‌ట్టి, త‌న‌కు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేద‌ని స‌న్నిహితులు నుంచి అందిన స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: