పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేలిబ్రేటీగా మారిపోయాక మన తెలుగు హీరోలకే కాదు, దక్షణ భారతదేశ సినిమా రంగం ప్రముఖులకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోయాడు. టాలీవుడ్ లో పవన్ కు ఎటువంటి ఇమేజ్ ఉందో కన్నడ సినిమా రంగంలో ఉపేంద్రకు కూడా ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అనేక వెరైటీ సినిమాలు నటించిన కెరియర్ గ్రాఫ్ ఉపేంద్రది, కన్నడ ప్రేక్షకులు ఇతని నటనను విపరీతంగా ఇష్టపడతారు. ఉపేంద్ర నటించిన చాల సినిమాలు తెలులో కూడా డబ్ అయి విజయవంతం సాధించాయి. గత కొద్దికాలం గా కన్నడ సినిమా రంగంలో సైలెంట్ గా ఉన్న ఉపేంద్ర ఈ మధ్య కన్నడంలో విడుదల అయిన ‘టోపీవాలా’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు.  నల్ల ధనం కధా వస్తువుతో ఈ సినిమా నిర్మింపబడింది. ఈసినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ ‘టోపీవాలా’ సినిమాకు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని బట్టీ ఏ టైటిల్ పెట్టాలి అని దర్శకుడు ఎం.జి. శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటే కన్నడ హీరో ఉపేంద్ర ఈ మధ్య విడుదలై సంచలనం సృస్టించిన ‘పవన్ అత్తారింటికి దారేది’ టైటిల్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ‘స్విస్ బ్యాంక్ కు దారేది’ అనే టైటిల్ ను పెడితే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని ఉపేంద్ర ఈ సినిమా నిర్మాతలకు సూచించాడట. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. పవన్ ‘అత్తారిల్లు’ లా ఉపేంద్ర కు స్విస్ బ్యాంక్ కు దారేది ఏ దారికి తీసుకేడుతుందో చూడాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: