స‌మంత వ‌రుస మూవీల‌తో బిజిబిజిగా మారుతుంది. అలాగే వ‌రుస స‌క్సెస్‌ల‌తోనూ ప‌ట్టరాని సంతోషంతో ఊగిపోతుంది. స‌మంత‌ను ఎవ‌రు ప‌ల‌క‌రించిన త‌న సినిమాలు సాధిస్తున్న స‌క్సెస్‌ల గురించే క‌బుర్లు చెప్పేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో స‌మంత అంటే స‌క్సెస్‌కు చిరునామ అంటూ కోటేష‌న్స్ కూడ చెబుతున్నారు. టాప్ హీరోలు సైతం స‌మంత కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే స‌మంత మాత్రం ఓ కొత్త హీరోతో జ‌తక‌డుతుంది. అదే బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం. ఈ మూవీకు వినాయ‌క్ ద‌ర్శకుడిగా ప‌నిచేస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో స‌మంత హీరోయిన్ ఉండటంతో ఆ మూవీకు అంత‌లా పేరొస్తుంది. అయితే హీరోగా శ్రీనివాస్ కొత్త కావ‌డంతో, స‌మంత సీనియ‌ర్ యాక్టర్‌గా అనుభ‌వం ఉండ‌టంతో, ఆ హీరోకు యాక్టింగ్ విష‌యాల్లో మెళుకువ‌ల‌ను నేర్పుతుంది. అలాగే రొమాంటిక్ స‌న్నివేశాల్లోనూ ఎలా చేయాలో బెరుకు లేకుండా చూపిస్తుంది. ఆ మూవీకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ ఫొటోషూట్‌లోనూ హీరోకు కంఫ‌ర్ట్‌గా ఉండే యాంగిల్స్‌ను కూడ త‌నే చెప్పిందంట‌. దీంతో కొత్త హీరోకు స‌మంత అన్ని విష‌యాలు ద‌గ్గర ఉండి నేర్పిస్తుందంటూ టాక్ వినిపిస్తుంది. కొంద‌రు మాత్రం స‌మంత ఇంత క్లోజ్‌గా ఉంద‌ని ఆ హీరో మాత్రం ల‌వ్‌లో క‌దా అంటూ టాలీవుడ్ స‌ర‌దాగా మాట్లాడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: