ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీకు రేపటి నుండి స‌రికొత్త హంగులు క‌లుస్తున్నాయి. ఈ మూవీకు సంబంధించిన ఆరు కొత్త సీన్లు రేప‌టి నుండి యాడ్ అవుతున‌న్నాయి. మొత్తం మూవీ నిడివికి మ‌రో ఆరు నిముషాలు నిడివి క‌లుస్తుంద‌న్నమాట‌. దీంతో ప‌వ‌న్ మూవీకు బాక్సాపీస్ వ‌ద్ద మ‌రింత క్రేజ్ పెర‌గ‌నుంది. దీపావ‌ళి కానుక‌గా అభిమానుల‌కు ప‌వ‌న్ ఇస్తున్న భారీ గిప్ట్ ఇదే అని టాలీవుడ్ చెబుతుంది. కొత్త సీన్లకు సంబంధించిన ప్రోమోల‌ను కూడ ఈ రోజు నుండి అన్ని ఛానల్స్‌లోనూ టెలికాస్ట్ చేస్తున్నారు. అత్తారింటికిదారేది మూవీ ఇప్పటికే రికార్డు స్థాయిలో క‌లెక్షన్స్‌ను కొల్లకొట్టింది. తాజాగా కొత్త సీన్ల తాకిడితో అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స్ వంద కోట్ల మార్క్‌ను చేరుకోవ‌డం ఖాయం అని అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎట్ ప్రెజెంట్ గబ్బర్‌సింగ్‌2 మూవీకు సంబంధించిన ప‌నుల్లో బిజిగా ఉన్నాడు. గబ్బర్‌సింగ్‌2 మూవీను 2014లో రిలీజ్ చేయ‌టానికి ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి. మొత్తానికి అత్తారింటికిదారేది మూవీలో కొత్త సీన్స్ యాడ్ అయ్యాయ‌ని తెలుసుకున్న అభిమాలు, సంతోషంతో సంభ‌రాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: