ప్రస్తుతం టాలీవుడ్ డైమండ్ లెగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పై రూమర్స్ రాని రోజంటూ ఉండదు అలాంటి క్రేజ్ ఆమెది. గ్లామరస్ హీరోయిన్స్ అంతా స్కిన్ షో చేస్తూ అవసరమైతే లిప్ లాకింగ్ సన్నివేశాలలో కూడా నటిస్తారు. కానీ సమంత అటువంటి సన్నివేశాలకు సామాన్యంగా దూరంగా ఉంటుంది. సమంత కెరియర్ తొలిరోజులలో నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా తర్వాత మళ్లీ అటువంటి పాత్రలో సమంత కనిపించలేదు. అయితే తాజాగా సమంత నటిస్తున్న సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి అంటు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు హీరోగా నటిస్తున్న సినిమాలో సమంతను హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా సమంత రొమాంటిక్ గా నటిస్తోంది అంటు సమాచారం. అంతేకాకుండా సమంత లిప్ లాక్ సన్ని వేసాల ఫోటోలు కూడా వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. గతంలో ఇటువంటి సన్నీ వేషాలలో నటించాను అని చెప్పిన సమంత ప్రస్తుతం ఆమె ఎందుకు ఇలా చేస్తోందో అంటూ ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సమంతకు స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు ఆమెకు బెల్లంకొండ సురేష్ సహాయం వల్ల ఫిదా అయిపోయిన సమంత ఈ విధంగా తన ఋణం తీర్చుకోవడానికి ఈ లిప్ లాకింగ్ సన్నివేశాలకు ఓకె చెప్పింది అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజమో సమంతకే తెలియాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: