మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్, టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడని వారంతా పండగ చేసుకుంటుంటే వారికి బాంబు లాంటి వార్త వినిపించాడు పవన్ సోదరుడు నాగబాబు. తన పుట్టిన రోజు సంధర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మాటలు నాగబాబు కాక మరెవరైనా అంటే ఈ పాటికి రచ్చరచ్చ అయ్యేదే. నిజానినికి పవన్ కళ్యాన్ సినిమా కెరియర్ అంతా ఎత్తుపల్లాలే, పెద్దగా హిట్లు లేవు. ఈ మద్య ‘గబ్బర్ సింగ్’ సినిమా హిట్టు కావడం, ఆతర్వాత వెంటనే ‘అత్తారింటికి దారేది’ సినిమా బంపర్ హిట్టు కావడంతో పవన్ ను అంతా నెంబర్ వన్ అంటున్నారు. కాని దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మూడు సినిమాలు వరుసగా హిట్టయిన మహేష్ బాబే నెంబర వన్ అంటున్నారట టాలీవుడ్ లో. అయితే నాగబాబు మాత్రం అలా అనకుండా తన బ్రదర్ పవన్ నెంబర్ వన్ కాదు, ఇంకా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నాడు, సూపర్ స్టార్ రజనీకాంతే నెంబర్ వన్. అంతే కాదు పవన్ రాజకీయాల్లోకి కూడా రావడం లేదన్నారు. దీంతో పవన్ అభిమానులు పాపం నిరాశకు లోనయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: