భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజ్ అయిన మూవీ భాయ్‌. భాయ్ మూవీను నాగార్జునే త‌న సొంత బ్యాన‌ర్‌లో నిర్మించాడు. మూవీను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌పోయిన‌ప్పటికి, మూవీ రిజ‌ల్ట్ మాత్రం సిని అభిమానుల్లో నెగిటివ్ టాక్‌ను తీసుకువెళ్ళింది. మూవీకు మొద‌టి రోజు వ‌చ్చిన టాక్‌ను బ‌ట్టి చూస్తే ఘోరంగా న‌ష్టాన్ని చ‌విచూడాల్సి ఉంటుంద‌ని టాలీవుడ్ ఊహించింది. కాని ఈ మూవీ త‌రువాత స‌రైన మూవీలు లేకోపోయేస‌రికి భాయ్ మూవీ క‌లెక్షన్స్, టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద నిల‌క‌డ‌గానే ఉన్నాయి. అనుకున్న బ‌డ్జెట్ కంటే త‌క్కువు బ‌డ్జెట్‌కే డైరెక్టర్ వీర‌భ‌ద్రమ్ ఈ మూవీను పూర్తిచేశాడు. ఇది కూడ భాయ్ మూవీకు వ‌చ్చే న‌ష్టాన్ని కొంత మేర త‌గ్గించింది. దీపావ‌ళి వ‌ర‌కూ ఎటువంటి కొత్త మూవీలు లేక‌పోయోస‌రికి, భాయ్ సేఫ్ జోన్‌లో ప‌డిన‌ట్టే అని టాలీవుడ్ అంటుంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ వీర‌భ‌ద్రమ్ మాత్రం భాయ్ మూవీకు సంబంధించిన ప్రమోష‌న్స్‌లో తెగ పార్టిసిపెట్ చేస్తున్నాడు. ఎక్కడా మూవీకు నెగిటాక్ రాకుండా ఎప్పటిక‌ప్పుడూ టెలివ‌జ‌న్స్ ద్వారా భాయ్ మూవీను ప్రమోట్ చేస్తున్నాడు. స్పెష‌ల్ ఇంట‌ర్వూస్‌, ప్రెస్ మీట్స్ పెట్టి మూవీపై ఆడియ‌న్స్ పాజిటివ్ రిపోర్ట్ గురించి తెగ చెబుతున్నాడు. ఈ విధంగానైనా మూవీకు వ‌చ్చే న‌ష్టాన్ని కొంత మేర త‌గ్గించ‌వ‌చ్చని వీర‌భ‌ద్రమ్ తెగ క‌ష్టప‌డుతున్నట్టు టాలీ టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: