డైరెక్టర్ మురుగదాస్‌ త‌న క‌థ‌ను నాలుగున్నర‌ కోట్లకు అమ్ముకొని టాక్ ఆప్ ద ఇండ‌స్ట్రీ అయ్యాడు. ఇదంతా బాలీవుడ్ మూవీ వ్వవ‌హారంలో జ‌రిగింది. ఎట్ ప్రెజెంట్ స‌ల్మాన్‌ఖాన్ త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ 'జ‌య్‌హో' లో న‌టిస్తున్నాడు. 'జ‌యహో' మూవీను తెలుగులో చిరంజీవి న‌టించిన స్టాలిన్ మూవీకు రిమేక్‌గా తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో స్టాలిన్ మూవీ కూడ బాక్సాపీస్ వ‌ద్ద దుమ్ముదులిపింది. ఈ మూవీను డైరెక్ట్‌చేసింది మురుగదాస్‌. అలాగే క‌థ కూడ మురుగదాస్‌దే. దీంతో స్టాలిన్ మూవీ క‌థ‌ను మురుగుదాస్ వ‌ద్ద 'జ‌య‌హో' నిర్మాత‌లు భారీ రేటుకు కొన్నారు. దాదాపు నాలుగు కోట్ల రూపాయ‌ల‌ను మురుగదాస్‌కు ఇచ్చి, ఆ క‌థ‌ను రిమేక్ హ‌క్కుల కోసం కొన్నారు. బాలీవుడ్‌లో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుటి వ‌ర‌కూ సౌత్ ఫిల్మ్స్‌ను రిమేక్ చేసిన వాటిలో, ఎక్కువ రేటుతో కొన్న క‌థ ఈ స్టాలిన్ మూవీనే. మురుగదాస్ ఇదివ‌ర‌కే అమీర్‌ఖాన్‌తో గ‌జిని మూవీను తీసి బ్లాక్‌బ‌స్టర్ ద‌ర్శకుడిగా పేరు తెచ్చుకోవ‌డంతో, త‌న క‌థ‌కు ఇంత డిమాండ్ వ‌చ్చింద‌ని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: