పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది' ‘మగధీర’రికార్డు లను బ్రేక్ చేసి 100 కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది. ఈ టార్గెట్ ను సాధించడం కోసం ఈ సినిమా దర్శక నిర్మాతలు మరో 6 నిమిషాల హాస్య సన్నివేశాలను కలిపి టాలీవుడ్ సినిమా 100 కోట్ల రికార్డు ఫై కన్ను వేసింది. పవన్ తన అభిమానులకు దీపావళి కానుకగా ఈ 6 నిముషాల బహుమతి ఇస్తూ ఉంటే ఇదే మార్కెట్ ఫిలాసఫీని అనుసరిస్తూ మంచు విష్ణు కూడా తన ‘దూసుకెళ్తా’ సినిమాకు ఒక పాట అదేవిధంగా వెన్నెల కిషోర్, బ్రహ్మనందం పై కొన్ని హాస్య సన్నివేశాలు దీపావళి నుండి కలుపుతున్నట్లు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇప్పటికే ఎవరేజ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమాకు ఈ ప్రయత్నాలు, కలెక్షన్స్ పెంచడానికి ఎంతవరకు సహకరిస్తాయో అనుమానమే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఇలా విడుదలైన సినిమాకు ఎడిటింగ్ లో మిగిలిపోయిన భాగాలను కలపడం చరణ్ ‘మగధీర’ సినిమాకు చాలా ప్లస్ గా మారితే ఈ సంవత్సరమే విడుదలై సూపర్ హిట్ టాక్ పొందిన ‘మిర్చి’ సినిమాకు కొన్ని సన్నివేశాలను కలిపినా నిర్మాతలు ఆశించిన ఫలితాలు అందివ్వలేదు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ కళ్యాణ్ ‘అత్తారిల్లు’ సినిమాకు చేస్తున్న ప్రయోగాన్ని పూర్తిగా అనుసరిస్తూ మంచు వారి హీరో విష్ణు చేస్తున్న ప్రయోగం ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: