“అది ఆడపిల్ల రా అభిమానం ఉంటుంది - నేను కొడుకుని నాన్న కోపం ఉంటుంది.”, “ఎక్కడ నేగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు”, “గన్ చూడలనుకో - బులెట్ చూడలనుకోకు”, “మనోడు కానప్పుడు మనవడు అయితే ఏంటి, ఎవడైతే ఏంటి”, “ఇది నీ దర్శనం – ఇది నిదర్శనం”, “నేను పిడికిలి బిగిస్తే గాలి కూడా ఊపిరాడక చస్తుంది” ఇవన్ని త్రివిక్రమ్ శైలికి చిన్ని నిదర్శనాలు. ఇలాంటి రచయిత అత్తారింటికి దారేది విషయంలో చాల విమర్షలు ఎదురుకున్నారు.         అత్తారింటికి దారేది చిత్రం ప్రతీ రివ్యూ లో త్రివిక్రమ్ పని అయిపొయింది, పంచ్ లో పవర్ తగ్గింది, దర్శకత్వంలో దమ్ము లేదు అని విమర్షించని వారు లేరు. త్రివిక్రమ్ పెన్ లో పవర్ అయిపొయింది, ఇంకా అతని నుండి పెద్దగా ఆశించలేం అన్నవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళందరికి ఇది తెలుసోలేదో మరి, వానలు పడనప్పుడు మొక్కలకి నీళ్ళు పోయాలి కాని జోరు వాన లో కాదు. అలానే అతడు, ఖలేజ, జులాయి కి ఎలా రాసాడో అలానే అత్తారింటికి దారేది లో రాయటం కుదరదు.         ఏ సినిమాకి ఎలాంటి సంభాషణలు రాయాలో, ఎక్కడ పంచ్ లు వేయాలో, ఎక్కడ ఏడిపించాలో, ఎక్కడ నవ్వించాలో మన కన్నా ఆయనకి బాగా తెలుసు. ఆయన పంచ్ లో కొంచెం పవర్ తగ్గిందేమో కానీ, డైలాగ్స్ లో డెప్త్ బాగా పెరిగింది. ఇంతకీ మన త్రివిక్రమ్ మాటల మంత్రికుడన్న విషయం మరవకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: