ఇక పెద్ద హీరోలతో సినిమా చేయడం వీలయ్యే పని కాదని అర్థమైపోయినట్టుంది పూరీ జగన్నాథ్ కి. అందుకే తనతో పని చేయాలని ఉత్సాహపడే ఓ మాదిరి హీరోల కోసం పని చేయడానికి రెడీ అయిపోయాడు. స్టార్ హీరోతో తప్ప పని చేయనివాడు, స్టార్ అక్కర్లేదు, హీరో అయితే చాలు అనే పరిస్థితికి వచ్చేశాడు. నోటిదూల మనిషిని ఎక్కడికి చేరుస్తుందో తెలుసుకోవడానికి పూరీ కంటే మంచి ఉదాహరణ మనకు దొరకదు.  ఓ హీరోని జనాలు పిచ్చిగా ప్రేమిస్తున్నప్పుడు, డైరెక్టర్ అన్నవాడు ఆ క్రేజ్ ని వాడుకుని సినిమాని డూపర్ హిట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అబ్బే... అది మానేసి, ఆ హీరో గురించి అవాకులు చెవాకులు పేలి, అటు సదరు హీరోకీ ఇటు అతడి ఫ్యాన్స్ కీ కూడా తిక్క రేగేలా చేసేంత తెలివి తక్కువతనం పూరీకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్న వైరి కళ్లు మూసి తెరిచేలోపు మనోడిని పాతాళంలోకి పడేసినంత పని చేసింది. కట్ చేస్తే... నితిన్ తో పూరీ సినిమా, విష్ణుతో పని చేయనున్న పూరీ అంటూ ఫ్లాష్ కమ్ షాకింగ్ న్యూసులు ప్రత్యక్షమయ్యాయి. అయితే కొద్దిరోజులు పోతే అన్నీ సర్దుకుంటాయని అనుకున్నారు కానీ, అలాంటిదేం జరగడం లేదు. పెద్ద హీరోలెవరూ అతగాడి వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకే ఏ హీరో తనతో పని చేయడానికి రెడీ అయినా ఆనందంగా తలాడిస్తున్నాడు పూరీ. నితిన్ తో హార్ట్ అటాక్ చేస్తున్నాడు. విష్ణుతో అసెంబ్లీ రౌడీని రీమేక్ చేయనున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో చేయడానికి కూడా సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ బరిలోకి దిగబోతోంది. దీన్ని బట్టి తెలియడంలా... పూరీ దారి ఏదో, అది ఎటువైపు సాగుతోందో!

మరింత సమాచారం తెలుసుకోండి: