అచ్చ తెలుగువాడైనా రానా నోట బాలీవుడ్ మాట ఎక్కువగా వస్తుంది అదేమిటో. ఎప్పుడూ అతడి దృష్టి బాలీవుడ్ మీదే ఉంటుంది. ఏమాత్రం చాన్స్ దొరికినా అక్కడికి జంప్ అయిపోదామని చూస్తుంటాడు. ఇక్కడ పని చేస్తున్నా అక్కడ చేయడం వేరన్నట్టు మాట్లాడతాడు. నిజానికి హీరోగా నిలదొక్కుకోవడంలో ఫెయిలయ్యాడు రానా. రామానాయుడి మనవడు, సురేశ్ బాబు కొడుకు, వెంకటేష్ కి అన్న కొడుకు... ఇన్ని ట్యాగ్ లు ఉన్నా అతడికి ఏమాత్రం కలసి రాలేదు. దానికి కారణం అయ్యగారి ప్లాస్టిక్ నటన. ఆ విషయం తెలుసుకోకుండా... పర్సనాలిటీ ఉంది కదా అని హీరోగా ఏదేదో చేసేద్దామనుకున్నాడు. పైగా తన టాలెంట్ ని తెలుగువాళ్లు గుర్తించలేదన్నట్టు ఫీలయ్యి బాలీవుడ్ చెక్కేశాడు. అక్కడా కలిసొచ్చిందేమీ లేదు. అందుకే మళ్లీ వచ్చేశాడు. రుద్రమదేవి, బాహుబలి సినిమాలు చేస్తున్నాడు. కానీ హీరోగా మాత్రం కాదు. ఇక తనకి హీరో యోగం లేదనుకున్నాడో ఏమో... నిర్మాత అవతారం ఎత్తుతానంటున్నాడు. అలా అని అతడు తెలుగు సినిమాలు తీస్తాననడం లేదు. బాలీవుడ్లో సినిమాలు తీస్తాడట. అందు కోసమే ఈ మధ్య అక్కడ ఇల్లు కూడా కొనేశాడు. ఓ రెండు సినిమాలను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. మరి ఈయనగారు సినిమాలు చూడకూడనంత పాపం తెలుగువాళ్లేం చేశారో మరి. అక్కడికెళ్లి దున్నేస్తానంటున్నాడు. ఒకవేళ అలా అన్నామే అనుకోండి... అలాంటిదేమీ లేదు, తెలుగు నా మాతృభాష, దీని తర్వాతే మిగిలినవన్నీ అంటూ రొటీన్ పాట పాడతాడు. ఆ లెక్చర్లు వినడం కంటే... ఏం చేస్తాడో సైలెంట్ గా చూడటం బెటర్!

మరింత సమాచారం తెలుసుకోండి: