గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ అనుకునేరు. మేం చెబుతున్నది ఎమ్మెస్ నారాయణ గురించి. మనుషులతో జాగ్రత్త సినిమాలో గబ్బర్ సింగ్ గెటప్పులో కనిపించబోతున్నాడు ఎమ్మెస్. ఓ ఐటెమ్ సాంగ్ కూడా చేయబోతున్నాడు. దాని గురించే మాట్లాడుతున్నది. బ్రహ్మీ హవాతో ఆ మధ్య కాస్త డల్ అయినా... దూకుడు సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చాడు ఎమ్మెస్. రకరకాల గెటప్పుల్లో ఆయా హీరోలను ఇమిటేట్ చేసి పిచ్చెక్కించేశాడు. దాంతో అప్పట్నుంచి ఆయనతో ప్రతి సినిమాలోనూ ఏదో ఒక డిఫరెంట్ గెటప్ వేయించే ప్రతయ్నం చేస్తున్నారు దర్శకులు. మనుషులతో జాగ్రత్త సినిమాలో అయితే... గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గెటప్ వేసేశాడు ఎమ్మెస్. వేయడం వరకూ బాగానే ఉంది. కానీ ఇటీవలే విడుదలైన ఆ సినిమా స్టిల్స్ చూస్తుంటే... కాస్త ఓవరైనట్టు అనిపిస్తోంది. ఐటెమ్ గాళ్ తో ఎమ్మెస్ సన్నిహితంగా ఉన్న ఆ చిత్రాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. సరదాగా ఆయనతో రొమాన్స్ చేయిద్దామనుకుని ఉంటాడు దర్శకుడు. దాన్ని డైరెక్ట్ గా సినిమాలో చూపిస్తే సరిపోయేది. కానీ స్టిల్స్ వదిలాడు. అంత పెద్దాయన ఓ ఐటెమ్ గాళ్ ని ఎక్కడెక్కడో తాకుతూ, ఎక్కడెక్కడో చూస్తూ ఉంటే... అవి చూడ్డానికి మనకు ఇబ్బందిగా అనిపిస్తోంది. పబ్లిసిటీ కూడా ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలి తెలియాలిగా. ఎందుకీ పనికిమాలిన ప్రయోగాలు!  

మరింత సమాచారం తెలుసుకోండి: