కష్టపడి పైకి రావడమంటే ఏమిటో ధనుష్ ని చూసి నేర్చుకోవచ్చు. అతడేమీ బ్యాగ్రౌండ్ లేనివాడు కాదు. కానీ హీరోగా ఎదిగింది బ్యాగ్రౌండ్ తో కాదు... తన కష్టంతో. తన టాలెంట్ తో. తన పట్టుదలతో. ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనరు, అనలేరు. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా విచిత్రంగా ఉండేవాడు ధనుష్. బక్క పలచగా, ఏదో పేదింటి పిల్లోడిలా కనిపించేవాడు. అప్పడందరూ వీడు హీరోనా అని ముఖమ్మీదే అనేసేవారట. కాస్త బాధ అనిపించినా, నా టాలెంట్ మీద నమ్మకంతో ముందుకు సాగాను అంటున్నాడు ధనుష్. అలా అడుగులు వేశాడు కాబట్టే ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడు. రజనీకాంత్ కి అల్లుడైనా, మామగారి ఖ్యాతిని ఏమాత్రం వాడుకోని గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు ధనుష్. ఈరోజుకీ అంతే సింపుల్ గా ఉంటున్నాడు. అంతే వినయంగా ప్రవర్తిస్తున్నాడు. రంఝానా సినిమాతో బాలీవుడ్లో కూడా దుమ్ము దులిపేశాడు మనోడు. మాస్ అంటే ఎలా ఉంటుందో అక్కడివారికి రుచి చూపించాడు. ఇప్పుడు అతడితో పని చేయడానికి అక్కడ బోలెడంత మంది రెడీగా ఉన్నారు. అది చాలక ఈ మధ్య హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి ధనుష్ కి. అయితే ఇక్కడ కాస్త బిజీగా ఉండటం వల్ల నో అంటున్నాడట. కాస్త ఫ్రీ అవగానే హాలీవుడ్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తాను, అక్కడ కూడా గెలుస్తానని నమ్మకం ఉంది అంటున్నాడు. కష్టపడేవాడికి ఎక్కడైనా సక్సెస్ వస్తుంది. బాలీవుడ్ ని అలరించిన ధనుష్ హాలీవుడ్ ని కూడా అలరించగలడనడంలో సందేహం లేదు!  

మరింత సమాచారం తెలుసుకోండి: