‘అత్తారింటికి దారేది’ సినిమా పవన్ కళ్యాణ్ ను సూపర్ స్టార్ గా మార్చి దక్షణాది సినిమా రంగంలో రజనీకాంత్ పక్కన పవన్ ను నిలబెడుతూ ఉంటే పవన్ తో పాటు అదే ఖ్యాతిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పొందుతున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో వంద కోట్ల సినిమాకు దర్శకత్వం వహించన డైరెక్టర్ గా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉన్నాడు. దీనితో త్రివిక్రమ్ తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.  ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకోవడానికి త్రివిక్రం మొగ్గు చూపుతున్నాడు. మాటల మాంత్రికుడి మెదడిలో కధలకు కొదవలేదు. కానీ ఆశ్చర్యంగా త్రివిక్రమ్‌ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. త‌న త‌ర‌వాత సినిమా ఇదీ అని ఇప్పటికి కూడా స్పష్టం చేయడం లేదు. ఎన్టీఆర్, చ‌ర‌ణ్, బ‌న్నీలతో సినిమాలు తీసే నిర్మాతలు త్రివిక్రమ్‌ డేట్స్ కోసం తిరుగుతున్నారు. త్రివిక్రమ్ ఓకె అంటే ఈ టాప్ హీరోలంతా రాత్రికిరాత్రి కాల్ షీట్స్ ఇచ్చేస్తారు. నిర్మాతలు కూడా త్రివిక్రమ్ కు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్దంగానే ఉన్నారు. అయితే మన మాట‌ల మాంత్రికుడు త‌న మ‌నసులో మాట బ‌య‌ట‌పెట్టడం లేదు. అదేవిధంగా తనకెంత కావాలో అడగడం లేదు ఈ ప‌రిస్థితి చూస్తుంటే ఎవ‌రు ఎక్కువ పారితోషికం ఇచ్చి సినిమా మొద‌లుపెట్టమంటే వారికి సినిమా చేసేద్దాం అనే ఆలోచ‌న‌లో త్రివిక్రమ్‌ ఉన్నట్లు ఫిలింనగర్ లో మాటలు వినపడుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్లుగా త్రివిక్రమ్ కూడా తన ఇమేజ్ కి ఎంత రేటు పలుకుతుంది అని తనకు తానే పరిక్ష పెట్టుకుంటున్నాడు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: