క‌ల‌ర్‌ఫుల్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వరికి అర్ధం కాదు. ఈ రోజు ఉన్న స్టార్‌డం రేపు ఉండ‌క‌పోవ‌చ్చు. ఎప్పటికీ రాని స్టార్‌డం చివ‌రి రోజుల్లో రావ‌చ్చు. ఇదిలా ఉంటే ఐశ్వర్యారాయ్‌కి ఇప్పుడు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. పోగొట్టుకున్న స్టార్‌డం మార్కెట్‌, తిరిగి సంపాదించుకుంది. ఒక‌ప్పుడు ఐశ్వర్యారాయ్‌తో యాడ్ చేయాలంటే అయిదు కోట్ల వ‌ర‌కు చెల్లించాలి. ఇదంతా ఒక సంవ‌త్సరం అగ్రిమెంట్‌కు సంబంధించిన వ్వవ‌హారం. పెళ్ళికి ముందు వ‌ర‌కూ అలాగే కొన‌సాగింది. పెళ్ళి త‌రువాత ప్రెగ్నెన్సీ స‌మయంలో ఐశ్వర్యారాయ్ స్థానాన్ని క‌త్రినాకైఫ్‌,దీపికాప‌దుకొనె,ప్రియాంక‌చోప్ర వంటి హీరోయిన్స్ కైవ‌సం చేసుకున్నారు. ఒకానొక సంద‌ర్భంలో ఐశ్వర్యారాయ్‌తో ఉన్న బ్రాండింగ్ అగ్రిమెంట్స్‌ను కూడ కార్పోరేట్ సంస్థలు ర‌ద్దు చేసుకున్నాయి. అదేవిధంగా ఒక బ్రాండ్‌కు సంబంధించిన ప్రమోష‌న్‌కు ఐష్‌కి రెండు కోట్ల రూపాయ‌లు ఇవ్వడం కూడ దండ‌గే అంటూ కామెంట్స్ కూడ వ‌చ్చాయి. ఇప్పుడు ఐష్, ఎండోర్స్‌మెంట్‌కు ఓ హాట్ ఆఫ‌ర్ ఇచ్చింది. 'న‌న్ను,నా బ‌ర్తను యాడ్స్ కోసం ఉప‌యోగించుకోండి. మొత్తంగా మాకు ముఫ్పై కోట్ల రూపాయ‌ల‌కు ఇచ్చేయండి' అంటూ ఆఫ‌ర్ ఇస్తుంద‌ట‌. రీసెంట్‌గా ఓ బ్రాండ్ ప్రమోష‌న్ కోసం ఐష్ ద‌గ్గర‌కు వ‌చ్చిన ఆ మేనేజ‌ర్‌కు ఈ విష‌యం చెప్పింది. ఐష్ చెప్పిన ఆఫ‌ర్‌కు క‌ళ్ళు తిరిగి ప‌డిపోతాడు అనుకుంటే ఆ మేనేజ‌ర్ మాత్రం ఐష్ అడిగిన అంత అమౌంట్‌ను ఇవ్వటాని సిద్ధప‌డ్డాడు. త్వర‌లోనే ఐష్‌,అభిషేక్‌లో మీద ఓ యాడ్ కూడ‌ రెడీ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: