తెలుగుతెర జక్కన్న రాజమౌళికి క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాలతో రాజమౌళి దక్షిణ భారతదేశ ప్రముఖ దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న ‘బాహుబలి' చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా పేరు తీసుకు వచ్చేటట్లుగా ప్రయత్నిస్తున్నాడు అంటు రాజమౌళి అభిమానులు అంటారు. అదేవిధంగా రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా నిర్మాణం చేస్తున్నాడు.  ఈ నేపధ్యంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘మేకింగ్ ఆఫ్ బాహుబలి’ టీజర్ ను రాజమౌళి కుమారుడు రూపొందించాడు అని వార్తలు రావడమే కాకుండా ఈ టీజర్ కు అతి తక్కువ రోజు లలోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. బాహుబలి మేకింగ్ వీడియో ఇంత బాగా రావడానికి కారణం తన కొడుకు కార్తికేయ అంటూ రాజమౌళి బహిరంగంగా నే చెప్పారు. దీనితో కార్తికేయను అందరూ ఆకాశానికి ఎత్తేసారు.  అయితే తాజాగా తేలుస్తున్న సమాచారం ఏమింటే బాహుబలి మేకింగ్ వీడియో కార్తికేయ సొంత కాన్సెప్టు కాదట, ఓ హాలీవుడ్ చిత్రం ప్రోమో నుంచి మక్కికి మక్కి కాపీ కొట్టారని వార్తలు టాలీవుడ్ లో హడావిడి చేస్తున్నాయి. ‘కామిక్ ఎపిక్' అనే ప్రోమో ఆధారంగా సేమ్ టు సేమ్ కాపీ కొట్టి ‘బాహుబలి' మేకింగ్ వీడియో తయారు చేసారట. గతంలో ‘ఈగ’ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత రాజమౌళి ఆ సినిమా కాన్సెప్ట్ ను కాక్ర్రోచ్ సినిమా నుండి కాపీ చేసాడని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అప్పట్లో రాజమౌళి ఖండించారు. క్రియేటివ్ మైండ్స్ ఏదేశంలో ఉన్నా ఒకలాగే అలోచిస్తాయని తన వాదన కూడా వినిపించారు. ఇక ప్రస్తుతం కార్తికేయ పై వస్తున్న రూమర్లకు రాజమౌళి ఏ పాయింట్ ఎత్తుకుంటారో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: