పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ హిమాలయ శిఖరం లా టాలీవుడ్ లో ఎవరికీ అందనంత స్థాయికి రోజురోజుకూ ఎదిగిపోతోంది అని చెప్పడానికి మరో లేటెస్ట్ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఇండియన్ సినిమాకు సంబంధించి ’10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా’ అనే అంశం పై జరిపిన ఆన్ లైన్ సర్వేలో పవన్ కళ్యాణ్ భారతదేశానికి సంబంధించిన వివిధ భాషలకు సంబంధించిన నటులలో పవన్ 5వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు 6వ స్థానం దక్కించుకోవడం విశేషం.  పవన్ కళ్యాణ్ కంటే ముందు మొదటి నాలుగు స్థానాల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు నిలిచారు. తమిళ హీరో విజయ్ 7వ స్థానంలో, అమీర్ ఖాన్ 8వ స్థానంలో, 9వ స్థానంలో రణబీర్ కపూర్, 10వ స్థానాన్ని అజయ్ దేవగన్ దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అంతటా పవనిజమ్ హోరులో యువతరం హడావిడి చ చేస్తున్న నేటి ప్రస్తుత పరిస్థుతులలో న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించిన ఈ ఆన్ లైన్ సర్వే ఫలితాలు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఈ టాప్ టెన్ లో రజనీకాంత్, కమలహాసన్ లు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ వార్త పవర్ స్టార్ పవన్ అభిమానులకు నిజమైన దీపావళి పండుగ.

మరింత సమాచారం తెలుసుకోండి: