మెగాహీరోల‌లో అస‌లైన హీరో వ‌స్తున్నాడ‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌రువాత అంత‌టి ప‌ర్సనాలిటి క‌లిగిన న‌యా హీరో వ‌రుణ్‌తేజ్ అని అంటున్నారు. నాగ‌బాబు త‌న‌యుడిగా వ‌రుణ్‌తేజ్ సిల్వర్‌స్క్రీన్ ఎంట్రికు రంగం సిద్ధం అయింది. వ‌రుణ్‌తేజ ఇప్పటికే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం కావాలి. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల వ‌రుణ్‌తేజ ఎంట్రిపై ఆల‌స్యం జ‌రుగుతుంది. మొత్తానికి డిసెంబ‌ర్ నెల‌లో వ‌రుణ్‌తేజ డెబ్యూ మూవీ విశేషాల‌ను తండ్రి నాగ‌బాబు అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌బోతున్నాడు. ఈ హీరో ఏ డైరెక్టర్‌తో ఎంట్రి ఇవ్వబోతున్నాడో వంటి వివ‌రాల‌లో ఇంకా క్లారిటి రాలేదు. లేటెస్ట్‌గా ఓ డైరెక్టర్‌ను ఓకె చేసిన‌ట్టు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. అలాగే వ‌రుణ్ స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ఏదిఏమైనా వరుణ్‌తేజ్ ఎంట్రి త్వర‌లోనే అని తెలియ‌డంతో ఈ మెగాహీరో సోషియ‌ల్ నెట‌వ‌ర్కింగ్ సైట్స్‌లో అంద‌రికి ట‌చ్‌లో ఉంటున్నారు. మెగా ప్యామిలికు సంబంధించిన ఫిల్మ్ అప్‌డేట్స్‌ను ప్రతి నిముషం మెసేజ్ ఇస్తున్నాడు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి వ‌రుణ్‌తేజ ఎక్కువుగా మాట్లాడుతున్నాడు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాక ఏ విధ‌మైన క‌ల్చర్‌ను ఫాలో అవ్వాలో వ‌రుణ్‌తేజ్‌ ఆ ట్రెండ్‌ను త్వర‌గానే క్యాచ్ చేస్తున్నాడ‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: