లేటెస్ట్‌గా రాజ‌మౌళి రిలీజ్ చేసిన బాహుబ‌లి ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ ఓ వీడియోకు కాపీ అంటూ న్యూస్ చ‌క్కెర్లు కొడుతుంది. ఈ న్యూస్‌పై నిర్మాత అధికారింగా స్పందించాడు. చేసింది కాపీ అయినా, రాయ‌ల్‌గా కాదు అని చెప్పడం అంటే ఇలాగే ఉంటుందేమో అని నిర్మాత మాటల్లో తెలుస్తుంది. నిర్మాత శోభు యార్లగడ్డ ఏ విధంగా స్పంధించాడంటే ‘మేము ఆ వీడియో టెంప్లెట్ ని అధికారికంగా కొనుగోలు చేసాము. మాకు లైసెన్స్ ఉంది. ఆ టెంప్లెట్ ని ఎవరన్నా కొనుక్కోవచ్చు. అది కాపీ కాదు. మేము అనుకున్నదానికి ఆ వీడియో టెంప్లెట్ బాగా సరిపోతుందని కొనుగోలు చేసామని’ ట్విట్టర్లో చెప్పాడు. ఒక గ్రాఫిక్ డిజైన‌ర్ చేసిన ప్రాజెక్ట్‌ను అధికారికంగా కొనుక్కొని, ఆ ప్రాజెక్ట్ ఎలా ఉందో అదేవిధంగా మేకింగ్ వీడియో తీర్చిదిద్ది ఇది మేము క్రియోట్ చేసిందంటే ఎవ‌రు దాన్ని న‌మ్ముతారు. ప్రాజెక్ట్‌ను రిఫ‌రెన్స్ తీసుకొని మ‌రో ర‌కంగా ప్రయ‌త్నిస్తే క్రియోటర్ అవుతాడేమో కాని, ఎవ‌రో చేసిన‌దాన్ని ఉప‌యోగించుకొని అంద‌రి చేత శెభాష్ అనిపించుకోవడం క్రియోట‌ర్‌ల ల‌క్షణం కాద‌ని టాలీవుడ్ అంటుంది. రాజ‌మౌళికు తెలియ‌కుండానే నిర్మాత ఆ విధంగా ట్వీట్ చేసి ఉండ‌డు అని టాలీవుడ్ అంటుంది. ఈ మేకింగ్ కాపీ వీడియోపై రాజ‌మౌళి కూడ ట్వీట్ చేసే అవ‌కాశం ఉంద‌ని చిత్రయూనిట్‌లో చ‌ర్ఛలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: