స్వీటీ లిప్స్ తాప్సీ ఇక రూటు మార్చుకుంటుంద‌ని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. తాప్సీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు వ‌చ్చిన‌ప్పటి నుండి ఎక్కువుగా గ్లామ‌ర్ రోల్స్‌కే ప్రాముఖ్యత చూపించింది. తాప్పీ ఏ మూవీలో అయితే వీర ఎక్స్‌పోజింగ్ చేస్తుందో ఆ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టడం ఖాయం అనే టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. తాప్సీ న‌టించిన మూవీలు బాక్సాపీస్ వ‌ద్ద స‌క్సెస్‌ను సాధిస్తే మాత్రం ఆ క్రెడిట్ అంతా హీరోకో, ద‌ర్శకుడికో ద‌క్కుతుంది. ఆ విధంగా తాప్సీ ఫిల్మ్‌కెరీర్ ఇప్పటి వర‌కూ అప్ అండ్ డౌన్స్‌లా కొన‌సాగుతుంది. ఎట్ ప్రెజెంట్ తాప్సీ రెండు మూవీల్లో న‌టిస్తున్నప్పటికీ అందులో తాప్సీ పాత్రకు అంత‌టి ప్రాధాన్యం లేదంట‌. ఈ బ్యూటీ కెరీర్ ఇక చివ‌ర‌కి వ‌చ్చిన‌ట్టే అని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. ఆ విధంగా ఆలోచించిన వారు తాప్సీ వ‌ద్దకు వ‌చ్చి తెలివిగా ఆఫ‌ర్స్‌ను ఇస్తున్నారు. అయితే అవి హీరోయిన్ ఆఫ‌ర్స్ కాదు. మూవీలో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తారా అంటూ ప్రొడ్యూజ‌ర్స్ తాప్సీను అప్రోచ్ అవుతున్నారంట‌. స్పెష‌ల్ సాంగ్ అంటే దాని అర్ధం ఐటెం సాంగ్ అనే. తాప్సీ ఐటెం సాంగ్ చేస్తే భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇవ్వటానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాప్సీ కూడ త్వర‌లోనే ఓ మూవీ కోసం ఐటెం సాంగ్‌ను చేయ‌టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: