తమిళ ప్రేక్షకులు ‘తల’ అని పిలుచుకునే అజిత్ కుమార్ ఈ దీపావళి కి తన ‘ఆరంభం’ తో మాంచి ఆరంభాన్ని ఇచినట్టే ఉన్నాడు. ఈ సినిమా రివ్యూస్ చూస్తుంటే విష్ణువర్ధన్ – అజిత్ కాంబినేషన్ మళ్ళి ‘బిల్లా’ మేజిక్ రిపీట్ చేయబోతున్నట్టే ఉంది. దాదాపు అన్ని తమిళ వెబ్ సైట్స్ ఆరంభం చిత్రానికి మూడు పైన రేటింగ్ ఇచ్చాయి. అజిత్ ఆరంభం తరువాత కార్తి ‘అల్ ఇన్ ఆల్ అళగు రాజా’, విశాల్ ‘పాండియ నాడు’ తెలుగులో ‘పల్నాడు’ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.      ఇక ఆరంభం కథ విషయానికి వస్తే, మామూలు ప్రతీకార కథ. అజిత్, రానా ఇద్దరు మంచి స్నేహితులు, రానా విలన్స్ చేతిలో చనిపోతాడు. వాళ్ళ మీద అజిత్, నయన తార ఆర్య తో కలిసి ఎలా పగ తీర్చుకున్నాడనేదే ఈ చిత్రం. కథ పరంగా చుస్తే పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు కాని, స్టైలిష్ టేకింగ్ లో దిట్ట అయిన విష్ణు వర్ధన్ తన తెలివితేటలతో ఇలాంటి మాములు కథకి క్రియేటివ్ రంగులు అద్దారు. అజిత్ ప్రత్యేకంగా డూప్ లేకుండా చేసిన బైక్ చేసింగ్ సన్నివేశాలు అభిమానులను అలరిస్తాయి. వీరిద్దరికీ తోడు యువన్ శంకర్ రాజ నేపధ్య సంగీతం చిత్రానికి హైలైట్.      మన రానా కి కూడా మంచి పాత్ర దక్కింది. ఆర్య, నయనతార, తాప్సి వాళ్ళ పాత్రలలో మెప్పించారు. చిత్రం మెదటి భాగంతో పోల్చితే విరామం తరవాత వచ్చే రెండవ భాగం కొద్దిపాటి మందకొడిగా సాగటం ఒక్కటే ఈ సినిమాకి ఉన్న ప్రతికూలాంశం. మొత్తానికి తమిళ్ ప్రేక్షకులకి ఆరంభం తో దీపావళి ఘనంగా ప్రారంభం అయింది. ఈ తమిళ్ ‘ఆరంభం’ మన తెలుగులో ‘ఆట ఆరంభం’ గ రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: