తెలుగు ఛానల్స్ లో ‘మా’ టివి సీరియల్స్ కు రియాలిటీ షోలకు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటుంది. అంతేకాకుండా సినిమాలు విషయంలో కూడా మాటివి ది పెద్ద స్థానమే. అందువల్లనే మాటివి ని మహిళలు ఇష్టపడుతూ ఉంటారు. టి ఆర్ పి రేటింగ్స్ లో కూడ మాటివి ముందు వరుసలో ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలను కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ సినిమా రైట్స్ కొని తమ ఛానల్స్ లో ప్రేక్షకుల కోసం వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాల సంవత్సరాల క్రితం మురళీమోహన్ తన జయభేరీ సంస్థ పై నిర్మించిన మహేష్ త్రివిక్రముల సినిమా ‘అతడు’ సినిమాను కొని గత కొన్ని సంవత్సరాలుగా చాల సార్లు టెలికాస్ట్ చేసింది. మహేష్ కెరియర్ లో ‘అతడు’ సినిమాకు మంచి పేరు వచ్చనా ఆరోజులలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు అయినా ఆరోజులలోనే మాటివి ఈ సినిమాకు భారీ పారితోషికాన్ని ఇచ్చి కొనుగోలు చేసి అప్పట్లో పెద్ద సంచలనమే చేసింది. ఈ సినిమాను ధీయేటర్ కు వెళ్ళి చూసిన ప్రేక్షకుల కన్నా మాటివి చానల్ లో చూసినవారే ఎక్కువమంది. ఇన్ని సార్లు ప్రసారం చేసినా ఈ సినిమాను ప్రసారం చేసినప్పుడల్లా మహేష్ అభిమానులే కాకుండా మామూలు ప్రేక్షకులు కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. దీనితో ఇప్పటికీ ఈ సినిమాకు టి ఆర్ పి రేటింగ్స్ బాగా వస్తూ ఉండడంతో మాటివికి ఈ సినిమా ప్రసార సమయంలో యాడ్స్ బాగా ఇప్పటికీ బాగా రావడంతో ఈ సినిమా కాంట్రాక్ట్ అయిపోయినా మాటివి యాజమాన్యం మళ్ళీ 3కోట్లు ఇచ్చి ఈ కాంట్రాక్టు ను రెన్యూ చేసుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని సార్లు ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులు మహేష్ కోసమా లేక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కోసమా అనే మాటలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: