మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ అప్‌క‌మింగ్ ఫిల్మ్ వెంక‌టేష్ కాంబినేష‌న్‌తో వ‌స్తున్న మ‌ల్టీ స్టార‌ర్ ఫిల్మ్ అని ఇండ‌స్ట్రీ అంటుంటే, వెబ్ ప్రపంచం మాత్రం అంత సీన్ లేదంటూ తెగ ఊధ‌ర‌గొట్టింది. చ‌ర‌ణ్‌తో న‌టించడం వెంక‌టేష్‌కు అస్సలు ఇష్టం లేదంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా గాసిప్స్‌ను క్రియోట్ చేశారు. అలాగే ఈ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్‌ను తెర‌కెక్కిస్తున్న డైరెక్టర్ కృష్ణవంశీ కూడ వెంక‌టేష్‌ను మార్చే ఉద్ధేశంలో ఉన్నాడంటూ ర‌క‌ర‌కాల వార్తలు ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్కెర్లు కొట్టాయి. ఇందులో ఏది నిజ‌మైన వార్తో తెలియ‌క స‌గ‌టు అభిమానికి సైతం ప‌లు అనుమానాలు వ‌చ్చాయి. ఇంత‌కాలానికి ఆ మల్టీస్టార‌ర్ ఫిల్మ్‌పై అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్ వ‌చ్చింది. మెగా కాంపౌండ్‌నుండి వ‌చ్చిన వార్త ప్రకారం ''విక్టరీ వెంక‌టేష్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తేజ కాంబినేష‌న్లో బండ్ల గ‌ణేష్ నిర్మాత‌గా, డైరెక్టర్ కృష్ణవంశీ తీస్తున్న మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ అఫిషియ‌ల్‌గా ఖ‌రారైంది'' అంటూ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో రామ్‌చ‌ర‌ణ్‌,వెంక‌టేష్ మ‌ల్టీస్టార్ ఫిల్మ్‌పై వ‌స్తున్న గాసిప్స్‌కు ఇక‌ తెర‌ప‌డిన‌ట్టే. ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తున్నారు అనేదానిపై ఇంకా చ‌ర్ఛలు జ‌రుగుతున్నాయి. ఇదే నెల‌లో ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ళటానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని ఇండ‌స్ట్రీ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: