ఒక్కసారిగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్ ఐకాన్‌గా స‌మంత మారింది. వ‌రుస విజ‌యాల‌తో స‌మంత క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇదిలా ఉంటే స‌మంత‌పై ఇద్దరు టాప్ హీరోయిన్స్ పెత్తనం చెలాయించ‌టానికి ప్రయ‌త్నిస్తున్నారు. ముఖ్యంగా స‌మంత అవ‌కాశాల‌ను క్యాన్సిల్ అయ్యేలా ప్రయ‌త్నిస్తున్నారు. స‌మంత టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయిన త‌రువాత ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ క్రేజ్‌ను క్రియోట్ చేసుకున్నారు. వాళ్ళే కాజ‌ల్ అగ‌ర్వాల్, త‌మ‌న్న. ఇప్పుడు వీళ్ళిద్దరికి టాలీవు్డ్‌లో స‌రైన ఆఫ‌ర్స్ లేవు. ఉన్న అతి కొద్ది ఆఫ‌ర్స్ కూడ ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల కార‌ణంగానే ఇప్పుడు ఆ ఫిల్మ్స్‌లో న‌టిస్తున్నారు. నిజానికి ఈ మ‌ధ్య కాలంలో స‌మంత న‌టించిన మూవీల‌లో ఎక్కువుగా కాజ‌ల్ న‌టించాలి. అలాగే బెల్లంకొండ సురేష్ త‌న‌యుడి మూవీలోనూ మొద‌ట‌గా న‌టించాల్సింది త‌మ‌న్నానే. కాజ‌ల్‌,త‌మ‌న్నాల‌కి ఏదోక విధంగా ఏవేవో కార‌ణాలు చెప్పి వాళ్ళను క్రేజీ ప్రాజెక్ట్స్‌కు దూరంగా ఉంచుతున్నారు. అప్ క‌మింగ్‌ ప్రాజెక్ట్స్‌లో కాజ‌ల్‌,త‌మ‌న్నాల‌ను హీరోయిన్స్‌గా తీసుకుంటామ‌ని చెప్పిన ప్రొడ్యూజ‌ర్స్‌, హీరోలు త‌రువాత మాట మారుస్తున్నారు. మూవీలు ఆల‌స్యం అవుతున్నాయ‌ని చెప్పి కొంత కాలానికి ఆ ప్రాజెక్ట్‌లో స‌మంత‌ను తీసుకొని వీళ్ళకు షాక్ ఇస్తున్నారు. ఇలా ఎన్నో విష‌యాల్లో కాజ‌ల్‌,త‌మ‌న్నాల‌కి అన్యాయం జ‌రిగిందంట‌. అందుకే ఎట్టి ప‌రిస్థితులోనూ ఇచ్చిన మాట‌ల‌ను నిల‌బెట్టుకోవాల్సిందే అని కాజ‌ల్‌,త‌మ‌న్నాలు హీరోల‌పై ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. దీంతో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న మూవీల‌లో సెకండ్ హీరోయిన్‌గా వీళ్ళకు ఛాన్స్ ఉండ‌వ‌చ్చని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: