విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు వరుస విజయాలతో ‘విక్టరీ’ ని తన పేరుగా మార్చుకున్న కథానాయకుడు, ఇప్పుడు ఒక్క విజయం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం కాస్త మహేష్ ఖాతాలో జమచేసారు, దాని తరవాత సోలో గా వచ్చిన ‘షాడో‘ ఎంతటి గొప్ప కళాఖండమో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటించిన మరో మల్టిస్టారర్ ‘మసాలా’ ఈ నెలలోనే విడుదల కావచ్చని సమాచారం. మసాలా ప్రమోషన్ లో భాగంగా వెంకీ చెప్పిన సంగతులు ఆయన మాటల్లో – పెద్ద స్టార్ ని అనే గర్వం నాకెప్పుడు ఉండదు. అది మా నాన్న గారి నుండి మాకు వచ్చింది. ఎప్పుడు సింపుల్ గా ఉండేదుకే ఇష్టపడతాను. స్నేహితులు కూడా అంటుంటారు అసలు ఏం మారలేదు అని. షూటింగ్ అయిపోగానే హీరో అనే మూడ్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాను, ప్రశాంతంగా ఇంటికి వెళ్లి కొడుకు అర్జున్ తో కాలక్షేపం చేస్తాను. ఈ దీపావళిన కూడా వాడికోసమే రంగు రంగుల మతాబులు కాల్చుతాను. ఆస్తులు అందరు ఇస్తారు కాని మంచి అలవాట్లు ఇవ్వలనుకుంటాను నేను. ఆధ్యాత్మిక చింతన లేకుంటే మనసుకి ప్రశాంతత ఉండదు. ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా దాన్ని కష్టపడి, సంపూర్తిగా చేయమని చెప్పారు నాన్న, ఇప్పటికి అదే పాటిస్తాను. ఇక సినిమా విషయాలకి వస్తే, మా కుటుంబం అంతా కలిసి నటించాలని నాన్న అడుగుతున్నారు. అందుకోసం కథలు వింటున్నాను. ‘మసాలా’ పేరుకు తగ్గట్టుగానే అన్నీకుదిరిన కుటుంబ కథాచిత్రం. నేను రామ్ చేసిన హంగామా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. త్వరలోనే రామ్ చరణ్ తో కలిసి నటించబోతున్నాను. పవన్ తో ఎప్పటినుండో చేద్దాం అనుకుంటున్నాను కాని కుదరట్లేదు. తొందర్లోనే తప్పకుండా మేం ఇద్దరం కలిసి నటిస్తాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: