ప్రతి సంవ‌త్సరం బాలీవుడ్‌లో దివాళి పండుగ వ‌చ్చిందంటే సిని అభిమానుల గుండెల్లో పండుగను మించిన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఎందుకంటే దివాళి పండుగ బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు అతి పెద్ద పండుగ‌. ఆ పండుగ స్పెష‌ల్‌గా రిలీజ్ అవుతున్న ఏ మూవీ అయినా బాక్సాపీస్‌ను షేక్ చేసే మూవీలా ఉంటుంది. గ‌త సంవ‌త్సరం దివాళి పండుగ స్పెష‌ల్‌గా షారుఖ్ ఖాన్ న‌టించిన జ‌బ్ త‌క్ హై జాన్‌, అలాగే అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టించిన స‌న్ ఆఫ్ స‌ర్ధార్ మూవీలు పోటీ ప‌డ్డాయి. రెండు మూవీలు పోటాపోటీగా రిలీజ్ అయి బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్షన్స్‌తో మోత మ్రోగించాయి. అలాగే రెండు సినిమా హీరోల మ‌ధ్య కొంత వ‌రకూ వ్యక్తిగ‌త పోరు కూడ న‌డిచింది. సీన్ క‌ట్ చేస్తే ఈ సంవ‌త్సరం దివాళి స్పెష‌ల్‌గా వ‌చ్చిన హృతిక్ రోష‌న్ క్రిష్‌3 మూవీ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజ్ అయింది. జెట్ స్పీడ్‌తో వ‌చ్చిన క్రిష్‌3 మూవీ సిని అభిమానులను బోరు కొట్టించింది. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఈ సంవ‌త్సరం దివాళి పండుగ వాతావ‌ర‌ణం క‌నుమ‌రుగైంద‌ని విశ్లేష‌కులు సైతం చెప్పుకుంటున్నారు. దీంతో హృతిక్‌రోష‌న్ న‌టించిన క్రిష్‌3 మూవీను సౌండ్‌లేని దివాళి బ్లాస్టింగ్ ఫిల్మ్‌గా అభివ‌ర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: