ప్రజలు - మొత్తం మీరే చేసారు, మొత్తం మీరే చేసారు, చాలు సార్, CM అయిన దగ్గర్నుండి మీరు మాకు చేసినవి చాలు. మేం కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. CM - ఏం కోల్పోయారు మీరు- ప్రజలు - ఇంకా అర్ధం కాలేదా మీకు, మీరు CM అయినప్పుడు ఏం ఉందొ, ఇప్పుడు ఏం లేదో తెలియట్లేదా మీకు ?  "రాష్ట్రం", మేము మా రాష్ట్రాన్ని కోల్పోయాం సార్. మీరు ముందుంది మరింత మంచి కాలం అంటారు. కాని మాకేం కావాలో, మేం ఎలా ఉండాలి అనుకుంటున్నామో తెలుసుకోరు. CM - నేనేం చేసిన గూడ్క అది మీ మంచి కోసమే. థిస్ ఇస్ క్లియర్ – ప్రజలు - అవును, మీరు చేసే పనులన్నిటిని 1000 చోట్ల క్లియర్ గా ఫ్లెక్సీలు పెడతారు, కాని ఒక్క సారి కూడా అవి మా వరకు వస్తున్నాయో లేదో తెలుసుకోరు. ఆ ఫ్లెక్సీలు చూస్తూ మీరు పొందే ఆనందమే మీకు తెలుసు, కాని అవి చూస్తున్నప్పుడు మాకు కలిగే ఆవేశం మీకు తెలీదు. అసలు మీరు సరిగా తెలుగులో మాట్లాడితే కదా, మాకు తెలిసేది మీరేం చేస్తున్నారో. ఏదైనా సమస్య రాగానే ఢిల్లీ కి పరిగెడతారు, అసలు మా CM మీరేనా అని డౌట్ వస్తుంటుంది మాకు. మీరే రచ్చ బండ పెడతారు, మమ్మల్ని పిలుస్తారు, మేం వస్తాం, మీకు తెలిసిన తెలుగులో ఆపకుండా మాట్లాడుతుంటారు, అప్పుడు మాకెలా ఉంటుందో తెలుసా, మీ ముందున్న “మైక్ ని నేలకేసి కొట్టి మాకేం అర్ధం అవ్వట్లేదూ.. దయచేసి తెలుగు మాట్లాడండీ” అని గొంతు చించుకు అరవాలనిపిస్తుంది. రాష్ట్రం విడిపోదంటారు, మేం నమ్ముతాం, మీకెలా తెలుసని అడిగితే ఇందిరమ్మ కి ఇష్టం లేదంటారు. ఎప్పుడో చనిపోయిన ఇందిరమ్మ గురించి చెప్తుంటే నవ్వుతున్నారు సార్ నేషనల్ మీడియా వాళ్ళు. రూపాయికే కిలో బియ్యం అంటారు, మా కడుపునిండా తిండి పెట్టాలనుకుంటారు, 10 రూపాయల ధర ఉన్నప్పుడు బియ్యంలో రాళ్ళూ ఏరేవాళ్ళం, ఇప్పుడు రాళ్ళలో బియ్యం ఏరి, వండుకొని తినాలంటే ముద్ద దిగటం లేదు సార్. 100 రూపాయలకే నిత్యావసర సరుకులంటారు, మేం ఏమి వండుకోవాలో కూడా మీరే చెప్తే ఇంకా మేమెందుకు సార్. మీరేం మాట్లాడతారో అర్ధం చేసుకోలేక, మీ మీటింగ్ లు రోజు టీవిలో చూసి పిచ్చెక్కి ఆఖరికి ఒకరోజు UTTER FLOP అరవ డబ్బింగ్ సినిమా చూడటానికి వెళ్ళాను సార్. మన రాష్ట్రం లో పరిస్తితులు ఎప్పుడు మామూలుగా అవుతాయో, అసలు అవుతాయో లేదో, మన రాష్ట్ర పరిస్తితి ఎందుకు ఇలా తయారయిందో మీకే తెలీకపోతే ఇంకా ఢిల్లీ పెద్దలకి ఎలా తెలుస్తుంది సార్. వరదల్లో ఎంత నష్టపోయామో తెలుసుకోటానికి హెలికాప్టర్ లో వెళ్లివస్తారు, పొలాల దగ్గరికే వెళ్లారు, ఆ మాత్రం దానికి ఇంట్లోనే కూర్చొని ఏ న్యూస్ ఛానల్ లోనో చుస్తే సరిపోతుంది కద సార్. మీరు ఏ భాషలో మాట్లాడినా, ఎప్పట్లానే అర్ధం కాకపోయినా వింటుంటాం, కాని రాష్ట్ర విభజన ఆపటం తెలియని మీరు, దయచేసి రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది, ఇందిరమ్మ చెప్పిందంటు ఇంకెప్పుడు చెప్పకండి సార్ ప్లీజ్..

మరింత సమాచారం తెలుసుకోండి: