చిన్న కీటకం చేత విన్యాసాలు చేయించవచ్చని హాలీవుడ్ సినిమాలు చాల వచ్చినా ‘ఈగ’ ని హీరోగ చేసి వచ్చిన సినిమాలు ఇంతవరకు ఇతర దేశాలలో కూడ రాలేదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఏ ఫిలిం ఫెస్టివల్ జరిగినా ఈగ సినిమాను ప్రదర్శిస్తూ ఉంటారు, అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలలోనూ అవార్డులు వచ్చాయి, ఒక్క దర్శకత్వం విభాగానికి తప్ప. జాతీయ స్థాయి అవార్డులలో కూడా ఈగకు అవార్డులు వచ్చినా ఉత్తమ దర్శకుడు అవార్డు రాజమౌళికి జాతీయ స్థాయిలో రాలేదు.  ఇప్పటికే సినిమా విడుదలై దాదాపు యేడాది పైన కావస్తున్నా ఈ చిత్రానికి వస్తున్న అవార్డుల సంఖ్య ఆగట్లేదు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్, షాంఘై ఫిలిం ఫెస్టివల్, పుచోన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈగ అక్కడ కూడా అవార్డుల ను కూడా కొల్లగొట్టింది ఈగ ఒక్క రాజమౌళికి తప్ప. తాజాగా టొర్నొటో ఆఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఏకంగా 9 అవార్డులను సొంతం చేసుకుంది. వాటిల్లో ఉత్తమ విలన్, ఉత్తమ హీరో, ఉత్తమ చిత్రం అవార్డులు కుడా వున్నాయి.  అయితే ఇక్కడ కూడా ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి అవార్డురలేదు. జిమ్ మిక్లి దర్శకత్వం వహించిన ‘WE ARE WHAT WE ARE’ హారర్ సినిమాకు ఉత్తమ దర్శకుడి అవార్డు ఇచ్చారు. ఇక్కడ కూడా రాజమౌళికి నిరాసే ఎదురైంది. ఈ విధంగా చూస్తే రాజమౌళి చేత సృష్టింప బడ్డ ఈగ ఆ సినిమా విలన్ సుదీప్ తో పాటు రాజమౌళి పై కూడ పగబట్టిందనే అనుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: