పవన్ సినిమా పాటలు యంగ్ హీరోల సినిమాలకు టైటిల్స్ గావస్తున్న విషయం తెలిసిందే. పవన్ నామస్మరణ తమ సినిమాలలో చేస్తే ఏదో విధంగా కలిసివస్తుందని నేటినిర్మాతలకు సెంటిమెంట్ గా మారింది. ఇదే సెంటిమెంట్ ను హీరో విశాల్ కూడా పాటించి దీపావళి రోజున తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విశాల్ నిర్మాతగా మారి నిర్మించిన ‘పల్నాడు’ నవంబర్ 2వ తేదీన తెలుగు తమిళ భాషలలో విడుదలైంది.  ఈమధ్య కాలంలో సరైన హిట్లు లేక భాదపడుతున్న విశాల్ ఈ ‘పల్నాడు’ సినిమాను ఏదోవిధంగా హిట్ చేద్దామని ప్రయత్నించినా ఆ ప్రయత్నం ప్రేక్షకులకు రుచించలేదు. ‘నాపేరు శివ’ దర్శకుడు సుసింద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించదు. అంతేకాకుండా ప్రేక్షకుల సహనాన్ని కూడా కొంత వరకూ పరీక్ష పెడుతోంది. ఈ నేపధ్యంలో ఈసినిమా సెకండ్ ఆఫ్ లో ఈ సినిమాలో నటిస్తున్న విలన్ ఒక పొలిటీషియన్ ను ఒక సినిమా ధియేటర్ లో కలుసుకునే సన్నివేశం ఉంది.  ఈ సన్నివేశం జరిగే ధీయేటర్లో ‘అత్తారింటికి దారేది’ సినిమా ప్రదర్శింప బడుతూఉంటుంది. విలన్ రాజకీయవేత్తతో మాట్లాడే సందర్భంలో ‘అత్తారిల్లు’ సినిమా సన్నివేశాలు ‘పల్నాడు’ సినిమాలో ప్రేక్షకులకు కనిపిస్తాయి. అప్పటి వరకు విశాల్ సినిమాకు ఎందుకు వచ్చామా అని బాధ పడుతున్న ప్రేక్షకుడు ఒక్కసారిగా వెండి తెర పై పవన్ కనిపించే సరికి ఈలలతో ధియేటర్ లో హడావిడి చేసారు. విశాల్ సినిమాకు ప్రేక్షకులు ఈలలు వేయకపోయినా విశాల్ సినిమాలోని అత్తారిల్లు సన్నివేశాలకు ఈలలు వేయడం పవన్ స్టామినా ఏమిటో మరోసారి రుజువైంది..

మరింత సమాచారం తెలుసుకోండి: