ప్రిన్స్ మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బ‌స్టర్‌గా స‌క్సెస్‌ను సాధించిన మూవీ దూకుడు. అలాంటి దూకుడు కాంబినేష‌న్‌లో మ‌రో మూవీ రూపొందుతుంది. అదే ఆగ‌డు మూవీ. ఇందులో హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. అయితే రీసెంట్‌గా త‌మ‌న్నాకు ప్రిన్స్ మ‌హేష్‌బాబు నో అని చెప్పేశాడు. ఇది హీరోయిన్ విష‌యంలో కాదు. త‌మ‌న్నా ఆగుడు మూవీలో మంచి డ్యాన్స్ ఉండాలంటూ డైరెక్టర్ శ్రీనువైట్లను అడిగింది. త‌మ‌న్న మంచి డ్యాన్సర్ అనే విష‌యం అంద‌రికి తెలిసిందే. కాని మ‌హేష్‌బాబు త‌మ‌న్నాతో పోటీగా డ్యాన్స్ చేయాలంటే అది సాధ్యం కాని విష‌యం. అందుకే డైరెక్టర్‌తో త‌మ‌న్నా డ్యాన్స్‌ల‌కి నో అని చెప్పించాడు. అంతేకాకుండా త‌మ‌న్నాకు శ్రీనువైట్ల అడిష‌న‌ల్‌గా ఇంకో మాట కూడ చెప్పాడు. 'నువ్వు చెమ‌ట‌లు ప‌ట్టే విధంగా డ్యాన్స్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. నీకు ఆగ‌డు స్టోరిలో ఫుల్‌లెన్త్ క్యారెక్టర్ ఉంటుంది. కంగారు ప‌డాల్సిందేమి లేదు. సాంగ్‌లో నువ్వు ఎన్ని అందాలు చూసించినా అమ్మాయిలు,అబ్బాయిలు మ‌హేష్‌నే చూస్తారు' అంటూ డిటైల్‌గా వివ‌రించాడంట. దీంతో త‌మ‌న్నా ఆశ‌ల‌పై ప్రిన్స్ నీళ్ళు చ‌ల్లేశాడు. ఆస‌లే ఆఫ‌ర్స్ త‌క్కువుగా ఉన్న ఈ రోజుల్లో త‌న టాలెంట్‌ను చూపించ‌క‌పోతే త‌న గొప్పద‌నాన్ని ఇక ఎవ‌రు గుర్తిస్తారు అంటూ వాపోతుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: