‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పరాజయం తరువాత బన్నీ నటిస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా ఫై అల్లుఅర్జ్జున్ అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. దీనికితోడు ఈమధ్య అల్లుఅర్జున్ ఫేస్ బుక్ పేజీకి వన్ మిలియన్ లైక్స్ వచ్చిన సందర్భంగా బన్నీ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీపావళికి తన ఫేస్ బుక్ లో తన అభిమానులకోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది అని తన ఫేస్ బుక్ లో ప్రకటించడంతో అల్లుఅర్జున్ అభిమానులంతా బన్నీ నటిస్తున్న ‘రేసుగుర్రం’ టీజర్ విడుదల దీపావళి రోజు ఉంటుంది అని అనుకుంటూ దీపావళి కోసం ఎదురుచుసారు.  కాంతులు జిమ్ము కుంటూ దీపావళి వచ్చి వెళ్ళిపోయింది, కానీ పండుగరోజున బన్నీ హడావిడి అతడి ఫేస్ బుక్ లో ఏమి కనిపించలేదు. అంతేకాదు అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘రేసుగుర్రం’ టీజర్ విడుదల కాలేదు. దీనితో పండుగ పూట బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అంతేకాకుండా విడుదల అవుతుందీ అనుకున్న ‘రేసుగుర్రం’ టీజర్ విడుదల కాకపోవడానికి కారణం ఏమిటి అంటూ మదన పడుతున్నారు.  సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ బాబు ‘1’ మువీతో ‘రేసుగుర్రం’ పోటీ పడుతుంది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ ఎటువంటి చడిచప్పుడు లేకుండా ఉన్న రేసుగుర్రం సంక్రాంతికి ఎగురుకుంటు రాదా అనే అనుమానాలు అల్లుఅర్జున్ అభిమానులలో అలుముకుంటున్నాయి...  

మరింత సమాచారం తెలుసుకోండి: