‘అత్తారింటికి దారేది’ సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజ్ పవన్ కళ్యాణ్ తో సమానంగా టాలీవుడ్ ను ఊపెస్తోంది. సమైఖ్య ఉద్యమం, పైరసీ భూతం ఈ రెండిటిని ఎదిరించి పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారిల్లు’ సినిమా ‘మగధీర’ రికార్డులను బ్రేక్ చేసి వంద కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తోంది. ఈ టార్గెట్ ను చేరుకోవడానికి పవన్ అభిమానులను మళ్ళీమళ్ళీ ధీయేర్లకు రప్పించడానికి ‘అత్తారిల్లు’ సినిమా యూనిట్ కొన్ని కొత్త సీన్లను యాడ్ చేసి వంద కోట్ల టార్గెట్ ను అందుకోవాలన్న ప్రయత్నంలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.  అయితే సినిమా రిలీజ్ అయిన దాదాపు ఐదు వారాల తర్వాత కొత్త సీన్లను యాడ్ చేయాలని ఐడియా ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ ఆ ప్రయత్నం అంత సమర్ధవంతంగా నిర్వహింపబడలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఓ ఐదు కొత్త సీన్లను ఏర్పాటు చేశాం, మళ్లీ వెళ్లి చూసి ఆనందించండి అంటూ ఊదరగొట్టిన ఈ సినిమా యూనిట్. కొత్తగా కలిపిన సీన్లు మాత్రం మూడే అని అంటున్నారు. ఆ సీన్లలో కూడా పవన్ సన్నివేశాలు రెండు మాత్రమే అట. అది కూడా అంతా కలిపి మూడే నిమిషాలలో ఉండడం, అవి కూడా క్వాలిటీ లేకపోవడంతో మళ్లీ సినిమాకు వెళ్ళిన అభిమానులకు నిరాశ ఎదురైందని తెలుస్తోంది. అదీ కాక సినిమా చివరిలో పవన్ రికార్డింగ్ స్టూడియోలో పాడిన కాటం రాయుడా పాటను మళ్ళీ కలిపారు. అయితే అది యూ ట్యూబ్ లో ఇప్పటికే అది అందరు చాలాసార్లు దాదాపు చూసినదే కావడంతో అసలు ఈ సీన్స్ యాడ్ చేసిన తీరుపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది.  తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను ఎంతో గొప్పగా తీసి చూపెట్టిన త్రివిక్రం శ్రీనివాస్ ఈ లేటెస్ట్ సన్నివేశాల యాడింగ్ విషయంలో సరైన శ్రద్ద త్రివిక్రం శ్రీనివాస్ తో పాటు ఈ ఫిలిం యూనిట్ తీసుకోలేదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘అత్తారిల్లు’ తో పోటీ ఇవ్వగల సినిమా ఏదీ ధీయేటర్లలో లేదు కాబట్టి ఎదిఎలా ఉన్నా వంద కోట్ల కల నెరవేరుతుందనే ఆశిద్దాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: