తెలుగు సినిమాకి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన అత్తారింటికి దారేది కి మగధీర దర్శకుడు రాజమౌళి కూడా అభినందనలు అందజేశాడు. దీంతో అసలు ఇప్పుడు టాప్‌ 5లో నిలిచిన చిత్రాలేవి, తెలుగు సినిమా బ్లాక్‌బస్టర్‌కి ఎంత వసూలు చేసే సత్తా ఉంది వంటివి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆల్‌టైమ్‌ లిస్ట్‌లో టాప్‌ 5లో నిలిచిన హిట్స్‌ ఏవి అనే వివరాలు తెలియజేస్తూ, అవి ఎందుకు అంతగా సక్సెస్‌ అయ్యాయనేది విశ్లేషించే ప్రయత్నమిది. ప్రస్తుతం టాప్‌ 5లో ఉన్న చిత్రాలు    1. అత్తారింటికి దారేది  2. మగధీర  3.గబ్బర్‌సింగ్‌  4. దూకుడు  5. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు   అత్తారింటికి దారేది కొత్త ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచిందని, చరిత్ర సృష్టించిందని, మగధీర రికార్డులని అధిగమించిందని వంటి వార్తలు వినే ఉంటారు. ఈ చిత్రాలన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్‌ షేర్స్‌ పరంగా ప్రపంచ వ్యాప్త వసూళ్లలో 50కోట్లకి పైగా కలెక్ట్‌ చేసాయి కాబట్టి ఇకపై టాప్‌ 5 లిస్ట్‌లో చోటు దక్కించుకోవాలంటే ఏ సినిమా అయినా కానీ ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తేనే సాధ్యమవుతుంది. ఇక ఈ టాప్‌ 5 చిత్రాల వసూళ్ల వివరాల్లోకి వెళితే తెలుగు సినిమా హిట్‌ రేంజ్‌ గత ఆరేళ్లలో ఇరవై కోట్లకి పైగా పెరిగింది. రాబోయే రెండు, మూడేళ్లలో అది మరో పది నుంచి ఇరవై కోట్లు పెరగవచ్చు ననిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: