అత్తారింటి దారేది బ్లాక్ బస్టర్ తరువాత పవన్ అభిమానుల దృష్టి అంతా ‘గబ్బర్ సింగ్-2’ పై నిలిచింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ పై పవన్ ప్రియస్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త విషయాలను ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ అనేసరికి ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెరిగిపోవడంతో ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ చాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని ఈ సినిమా అఫీషియల్ లాంచ్ డిసెంబర్ 28 నుంచి ఉంటుందని తెలపడమే కాకుండా హీరోయిన్ తదితర సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో తెలియచేస్తామని సంపత్ నంది చెపుతున్నాడు. పవన్ సన్నిహితులు, అభిమానులు అందరూ కూడా ఈ సీక్వెల్ కు టైటిల్ కన్ఫ్యూజన్ లేకుండా గబ్బర్ సింగ్ పేరుతోనే ఈ సీక్వెల్ టైటిల్ ఉండాలని పట్టుపట్టడంతో పవన్ తానే స్వయంగా ‘షోలే’ నిర్మాతల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడని టైటిల్ విషయంలో ఒక అవగాహన షోలే నిర్మాతలతో ఏర్పరుచుకుని వారు కోరిన మొత్తం చెల్లించి ‘గబ్బర్ సింగ్’ టైటిల్ ను సొంతం చేసుకోవడానికి పవన్ విపరీతంగా కృషి చేస్తున్నాడని అందువల్లనే ఆలస్యం జరుగుతోందని సంపత నంది చెపుతున్నాడు. అదేవిధంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంపత్ మరార్ పవన్ కు ప్రియస్నేహితుడు కావడంతో మొదటిసారిగా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శరత్ మరార్ ఏవిధంగాను నష్టపోకుండా పక్కా ప్రణాళికతో పవన్ ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాల పై వ్యక్తిగత శ్రద్ద తీసుకుంటున్నాడని అందువల్లనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడానికి కొద్దిగా లేట్ అవుతోందని ఈ ‘రచ్చ’ దర్శకుడు అంటున్నాడు. పవన్ ను నమ్ముకుని నష్టపోయిన నిర్మాతలు టాలీవుడ్ లో చాల తక్కువ అని అంటారు. అటువంటిది పవన్ ప్రియనేస్తం తీస్తున్న సినిమా కాబట్టి కొంత ఆలస్యం అవుతోంది అనుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: