ఇండియ‌న్ బాక్సాపీస్ స్టామినా రోజు రోజుకి పెరుగుతూ వ‌స్తుంది. మ‌న ఇండియ‌న్ సినిమా త‌లుచుకుంటే వెయ్యి కోట్లు సాధించండం చాలా సింపుల్ అంటూ క‌మ‌ల్‌హాస‌న్ చెప్పిన లాజిక్ ఏదో ఒక రోజు నిజం అవ్వటం ఖాయం అని తాజా రిపోర్ట్స్‌ను చూస్తే తెలుస్తుందంటున్నారు. ఇప్పటి వ‌ర‌కూ ఇండియ‌న్ బాక్సాపీస్ వ‌ద్ద మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల క‌లెక్షన్స్‌ను సాధించిన మూవీగా చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ నిలిచింది. ఆ రికార్డ్స్‌ను క్రిష్‌3 మూవీ తుడిచేయండం ఖాయం అని అంద‌రూ అనుకున్నారు. కాని బాక్సాపీస్ వ‌ద్ద క్రిష్‌3 మూవీకు డివైడ్ టాక్ రావ‌డంతో క‌నీసం పెట్టిన పెట్టుబ‌డి అయినా తిరిగి రావ‌డం క‌ష్టం అంటూ అంద‌రూ తెగ మాట్లాడుకున్నారు. కాని క్రిష్‌3 బాక్సాపీస్ క‌లెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతూ వ‌స్తున్నాయి. క్రిష్‌3 నాలుగో రోజు క‌లెక్షన్స్ దుమ్ము రేపాయి. ఏకంగా 35.91 కోట్ల క‌లెక్షన్స్‌ను సాధించింది. ఇది కేవలం ఒకే రోజులో సాధించిన క‌లెక్షన్స్‌. మూడు వంద‌ల కోట్లు సాధించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ కూడ ఒకే రోజులో ఇంత పెద్ద క‌లెక్షన్స్‌ను సాధించలేక‌పోయింది. ఇప్పటి వ‌ర‌కూ క్రిష్‌3 మూవీ తొంబై కోట్లకు మించి బాక్సాపీస్ క‌లెక్షన్స్‌ను సాధించింద‌ని బాక్సాపీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: