ఈ మధ్య ఒక మల్టీ నేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లోని అమ్మాయిలు తమ ప్రోడక్ట్ గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో తమ ప్రోడక్ట్ గురించి అమ్మాయిల అభిప్రాయాలతో పాటు కొన్ని సాధారణ ప్రశ్నలు, ప్రేమ, సహజీవనం, సినిమాల గురించి కూడా ఆ సర్వేను నిర్వహించిన సంస్థ తరపు ప్రతినిధులు అడిగారట. ఇలా ప్రతి సంవత్సరం ఇటువంటి సర్వేలు నిర్వహించడం ఆ కంపినీ అలవాటు. సినిమాల గురించి ఈ సర్వే నిర్వాహుకులు అమ్మాయిల అభిమాన హీరో ఎవరు? అని అడిగిన ప్రశ్నకు ‘అత్తారిల్లు’ హీరో పవర్ స్టార్ పవన్ పేరు చెప్పారట. ఆ తరువాత స్థానంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వస్తే మూడు, నాలుగు ఐదు స్థానాలలో ప్రభాస్, అల్లుఅర్జున్, నితిన్ లు వచ్చారట. ఇదే సంస్థ గత సంవత్సరం నిర్వహించిన సర్వేలో మహేష్ బాబు ప్రధమ స్థానంలో వస్తే రెండవ స్థానంలో ప్రభాస్ రావడం జరిగింది. కేవలం ఒకే ఒకసంవత్సరం తేడాతో రాష్ట్రంలోని అమ్మాయిలు ఎక్కువగా అభిమానించే హీరో స్థానాన్ని మహేష్ నుండి పవన్ సొంతం చేసుకోవడం ఒక సంచలనం దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం మీడియాకు ఇంటర్వ్యులు ఇస్తున్న చాలామంది పరభాషా హీరోయిన్స్ దేశావ్యాప్తంగా పేరు గాంచిన మోడల్స్ తమతమ ఇంటర్వ్యూలలో తాము పవన్ కళ్యాణ్ తో నటించాలని కోరికగా ఉందని అంటున్నారు.  మీడియాలో గత సంవత్సరం ప్రసారం అయిన ఇదే తరహ ఇంటర్వ్యూలలో చాలామంది ముద్దుగుమ్మలు తమకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ తో నటించాలి అని చెప్పడం కొసమెరుపు ఒకేఒక్క సినిమా ‘అత్తారింటికి దారేది’ అమ్మాయిల అభిప్రాయాలను మార్చేసిన సినిమాగా కుడా రికర్డుకేక్కింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: