ప్రస్తుతం స‌మంత నోటి నుండి ఓకె అనే మాట కోసం ఎంతో మంది నిర్మాత‌లు క్యూలు క‌ట్టుకొని నించున్నారు. వీళ్ళంతా స‌మంతా కాల్షీట్స్ కోసం తెగ ప‌రితపిస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ స‌మంతా టాలీవుడ్ టాప్ పొజిష‌న్‌ను కైవ‌సం చేసుకుంది. కాని రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఇంకా టాప్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేదు. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్న హీరోయిన్స్‌గా త‌మ‌న్నా,కాజ‌ల్ నిలిచారు. స‌మంతా వీళ్ళ కంటే త‌క్కువ రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంది. అందుకే ఈ బ్యూటీ త‌క్కువ రేటుకే రావ‌డంతో అంద‌రూ స‌మంత వైపు ఎక్కువుగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు స‌మంత టాప్ పొజిష‌న్‌లో ఉంది కాబ‌ట్టి, రేటును పెంచేసి టాప్ రెమ్యున‌రేష‌న్ హీరోయిన్‌గా ఆ ఒక్క స్టెప్‌ను కూడ ఎక్కాలి అని తెగ ఉత్సాహం చూపిస్తుంది. అందుకే వ‌చ్చే సంవ‌త్సరం నుండి త‌న రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసింది. ప్రస్తుతం స‌మంత చేతిలో మ‌నం,ర‌భ‌స‌,బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలు మూవీలు ఉన్నాయి. వీట‌న్నింటికి అర‌వై ల‌క్షల లోపే రెమ్యున‌రేష‌న్ ఉంది. ఒక్క బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలోనే దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంద‌ని లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే స‌మంత న‌టించ‌బోతున్న లింగుస్వామి ప్రాజెక్ట్‌కి రెమ్యున‌రేష‌న్‌ను పెంచాల‌ని లేటెస్ట్‌గా ప్రపోజ‌ల్‌ను పెట్టిందంట‌. అలాగే 2015లో ఒప్పుకోబోతున్న ప్రాజెక్ట్స్ అన్నింటికి రౌండ్ ఫిగ‌ర్ కోటిరూపాయ‌ల వేసి త‌న రెమ్యున‌రేష‌న్ లెక్కను నిర్మాత‌ల‌కు చెబుతుంది. స‌మంత ఇంత రేటు పెంచినా ఈమెపై కోపం ఎవ్వరికి రావ‌డం లేదంట‌. ఎందుకంటే స్టోరిను బ‌ట్టి ఎక్స్‌పోజింగ్‌ను పెంచుతాను అంటూ చివ‌ర్లో స్వీట్ న్యూస్‌తో ఊరిస్తుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: