జర్నలిస్టుల దెబ్బ ఎలా ఉంటుందో దిల్ రాజుకు ఇప్పుడు బాగానే అర్థమైనట్లుంది. రామయ్యా వస్తావయ్య ఏవరేజ్ స్థాయిని కూడా అందుకోకుండా ఫ్లాప్ గా నిలవడానికి సినిమా జర్నలిస్టులు కొట్టిన దెబ్బే కారణం. ద్వితీయార్ధం ఎంత బ్యాడ్ గా ఉన్నా.. ప్రథమార్ధం పర్వాలేదనపించడంతో దిల్ రాజు ఒడ్డున పడిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా రాజుకు నష్టాల్నే మిగిల్చిందట. సినీ జర్నలిస్టులంతా ఈ సినిమా గురించి నెగెటివ్ గా రాయడంతో రెండు మూడు రోజులకే బాక్సాఫీసు వద్ద రామయ్య ప్రభావం తగ్గిపోయింది. వారం తిరిగేసరికే థియేటర్లు ఖాళీ అయిపోయాయి.  జర్నలిస్టులు రాజు సినిమా విషయంలో కనికరం చూపకపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. ఆ మధ్య జర్నలిస్టుల కోసం ఓ డిన్నర్ ఏర్పాటు చేసిన రాజు.. ఆ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాడు. ఇంత లేటేంటని ప్రశ్నిస్తే.. మీరు వచ్చింది తిని, తాగి పోవడానికే కదా, ఆ పని కానివ్వండి అంటూ చిరాకు పడ్డాడు రాజు. దీంతో చిర్రెత్తిన విలేకరులు ఆ డిన్నర్ ను బహిష్కరించి వెళ్లిపోయారు. మొదట పోతే పోనీలే అన్నట్లు వ్యవహరించిన రాజు.. వాళ్లను తిరిగి అక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు చేశాడు. ఐనా చాలామందికి రాజుపై కోపం పోలేదు. దీంతో రామయ్య వస్తావయ్యా సినిమా గురించి కాస్త కఠినంగానే రాశారంతా. జర్నలిస్టులకు కోపం వస్తే ఎలా ఉంటుందో బాగా అర్థం చేసుకున్న రాజు.. ఈ మధ్య వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడట. అందరితో గౌరవంగా మాట్లాడుతున్నాడట. జరగాల్సిన నష్టమెలాగూ జరిగిపోయింది కాబట్టి.. తర్వాతి సినిమాల విషయంలోనైనా తన పట్ల కనికరం చూపుతారన్నది రాజు ఆలోచన. హిట్ల మీద ఉన్నపుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుంది కానీ.. కాలం కలిసిరానపుడు కాస్త తగ్గడమే మంచిదని రాజు బాగానే గ్రహించాడన్నమాట.  

మరింత సమాచారం తెలుసుకోండి: