బాలీవుడ్ టాప్ హీరోయిన్ త‌ల్లి కాబోతుంద‌నే వార్త సంచ‌ల‌నాన్ని క్రియోట్ చేస్తుంది. దీపికా ప‌దుకొనె ప్రస్తుతం చాలా మంది హీరోల‌తో ఎఫైర్లను న‌డిపింది. ఇందులో ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు, బిజినెస్‌, స్పోర్ట్స్ సెల‌బ్రిటీలు కూడ ఉన్నారు. ఇంత మందిలో దీపికా ఎవ‌రిని సీక్రెట్‌గా పెళ్ళి చేసుకొని, అప్పుడే త‌ల్లిగా మార‌బోతుందంటూ సాధార‌ణ సినీ జ‌నాల్లోనూ విప‌రీత‌మైన ఆలోచ‌న‌ల‌ని రేకెత్తిస్తున్నాయి. నెల‌కో ఎఫైర్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దీపికా ఏ విధంగా త‌ల్లి కాబోతుంది అనే విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి ఎంతో ఆస‌క్తిని క‌న‌ప‌బ‌రుస్తున్నారు. నేష‌న‌ల్ టాబ్లాయిడ్ క‌థ‌నం ప్రకారం దీపిక‌ ఓ బాబును ద‌త్తత తీసుకునే ఆలోచ‌న‌లో ఉందంట‌. ఆ బాబుకు సంబంధించిన అన్ని జాగ్రత్తల‌ను జీవితాంతం వ‌ర‌కూ త‌నే చూసుకునే విధంగా దీపికా ఆలోచ‌న‌లు చేస్తుంద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ టాబ్లాయిడ్ వివ‌రించింది. దీపికాప‌దుకొనెకి పెళ్ళి చేసుకునే ఉద్ధేశం లేద‌ని, అందుకే బాబుని ద‌త్తత తీసుకుంటుంద‌ని బిటౌన్‌లోనూ చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఆ టాబ్లాయిడ్ చెప్పిన దాంట్లో నిజం ఎంత వ‌ర‌కూ ఉందో తెలియ‌దు కాని దీపికా మాత్రం బాబును ద‌త్తత తీసుకొని సొసైటి పట్ల త‌న‌కు ఉన్న బాధ్యత‌ను చూపిస్తుంద‌ని కొంత మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: