నందమూరి సింహం బాలయ్య ‘లెజెండ్’ సినిమా లో ఎన్నికలు ఇంకా రాకుండానే తన మోటార్ సైకిల్ ద్వారా తన ప్రచారాన్ని మొదలు పెడుతున్నాడు. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘లెజెండ్' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రం కోసం రూ. 20 లక్షల ఖర్చుతో హార్లే డేవిడ్‌సన్ బైకు ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలోని ఓ పాటలో బాలయ్య ఈ బైకుపై కనిపిస్తాడట. బాలయ్య స్వయంగా కోరడంతో పసుపురంగు బైకును కొనుగోలు చేసారట. ఆయన ప్రత్యేకంగా పసుపు రంగు ఎంచుకోవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  వచ్చే ఎన్నికలలో బాలయ్య చాల చురుకుగా తెలుగుదేశం ప్రచారంలో పాల్గొంటాడు అని చెప్పడానికి సంకేతంగా ఈ పసుపు రంగు మోటార్ సైకిల్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రంలో బాలకృష్ణ రాజకీయ భవిష్యత్‌కు సహకరించేలా కొన్ని డైలాగ్స్ ను పెట్టినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. మహేష్ బాబుతో భారీ సినిమాలు తీసే 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపించడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బుల్లెట్ బైక్, సఫారీ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జగపతి బాబు విలన్ గా దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఎన్నికల ముందు విడుదల అవుతుంది అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: