నిండైన విగ్రహం, ఊగిపోయే ఆవేశం, టపటపా పేలే డైలాగులు... బాలయ్య ఎనర్జీ మీద అభిమానులకు ఓ అంచనా ఉంది. అతడి పవర్ మీద ఓ క్రేజ్ ఉంది. అలాంటి బాలయ్య షూటింగు చేస్తూ సడెన్ గా పడిపోతే? ఈ వార్త వినడంతోనూ అభిమానుల హార్ట్ ఆగిపోయినంత పనవుతుంది. నిజానికి అదే జరిగింది. లెజెండ్ సినిమా విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య మాంచి హుషారుగా షూటింగులో పాల్గొంటున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆయన అస్వస్తతకు గురి కావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అంతవరకూ హుషారుగా ఉన్న బాలయ్య ఒక్కసారిగా పనిచేయలేనంతగా సోలిపోవడంతో ఆయనను హడావుడిగా ఆస్పత్రికి తరలించారట. అయితే కాసేపటి తర్వాత ఆయన మామూలైపోయారట. తిరిగి షూటింగులో పాల్గొన్నారని తెలిసింది. అయితే బాలయ్యకు ఏమయ్యింది, ఎందుకలా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందనే విషయాలు మాత్రం తెలియలేదు. దాంతో ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. వయసు మీదపడి బాలయ్య వీక్ అయివుంటాడు అని కొందరు సరిపెట్టుకుంటున్నా... ఎప్పుడూ లేనిది ఇలా ఎందుకు జరిగింది, బాలయ్యకు ఏదైనా అనారోగ్యమా అంటూ కొందరు తెగ టెన్షన్ పడుతున్నారు. అసలే ఈ మధ్య మన సెలెబ్రిటీలు చాలామంది అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండటంతో ఇలా లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నట్టున్నాయి. ఇలాంటివేమైనా జరిగినపుడు యూనిట్ వాళ్లెవరైనా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఎవరికీ టెన్షన్ ఉండదు కదా!  

మరింత సమాచారం తెలుసుకోండి: