గ‌త కొద్ది రోజులుగా మీడియాలోనూ, వెబ్‌లోనూ ఎన్టీఆర్‌,కొర‌టాల‌శివ కాంబినేష‌న్‌ మూవీ షురూ అంటూ విప‌రీత‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. రెండు రోజుల క్రితం అయితే వీరిద్దరి కాంబినేష‌న్‌లో మూవీ క‌న్‌ఫ‌ర్మ్ అంటూ కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాన్ని ఇప్పుడు తెలియ‌ప‌రుస్తున్నాం. ఎన్టీఆర్‌,కొర‌టాల‌శివ కాంబినేష‌న్‌లో మూవీ ఇప్పుడ‌ల్లా లేన‌ట్టే. ఇదే విష‌యాన్ని కొర‌టాలశివ అధికారికంగా చెప్పాడు. 'ఎన్టీఆర్‌తో నా మూవీ ఉంటున్నట్టు వ‌స్తున్నవార్తల్లో నిజం లేదు, దానికి సంబంధించిన చ‌ర్ఛలు ఇంకా జ‌రుగుతున్నాయి. మా ఇద్దరి కాంబినేష‌న్ పై మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు అల్లుతుంది. మొద‌టగా నేను మ‌హేష్‌బాబుతో, యుటివి మోష‌న్స్ నిర్మాణంలో మూవీను చేస్తున్నాను. త‌రువాత ఎన్టీఆర్‌తో మూవీ గురించి నేను,ఎన్టీఆర్ ఇద్దరం మాట్లాడుకొని మీకు చెబుతాం. ఎన్టీఆర్ ఆల్రెడీ ఇప్పటికే ఓ మూవీ న‌టిస్తున్నాడు. అది మే నెల వ‌ర‌కూ ప‌డుతుంది. ఇక‌నైన అటువంటి వార్తల‌ను ఆపేయండి' అంటూ మెసేజ్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌,కొర‌టాల శివ కాంబినేష‌న్ మూవీ ఇప్పట్లో లేన‌ట్టే అని తేలిపోయింది. ప్రిన్స్‌తో కొర‌టాల మూవీ 2014 వ‌ర‌కూ ప‌డుతుంది. ఒక‌వేళ ఎన్టీఆర్‌తో కొర‌టాల మూవీ చేయాలంటే అది 2015లోనే అని టాలీవుడ్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: