పవనిజమ్ క్రేజ్ మన ఆంధ్ర ప్రదేశ్ ను దాటి ఖండాoతరాలను దాటి అమెరికా లో కూడా మన ఆంధ్రులకు కూడా తాకింది అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికాలో ఒక కొత్త పవన్ కళ్యాణ్ పుట్టుకు వచ్చాడు, పవన్ సినిమాలలోని కొన్ని పాటలకు పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ డాన్సులు చేసేసి తనను తానే కొత్త పవన్ కళ్యాణ్ అని ప్రకటించేసుకున్నాడు ఓ యన్ అర్ ఐ. ఆయన అమెరికాలో ఓ పెద్ద డాక్టర్. ఆయన 20 సంవత్సరాలుగా అమెరికాలో డాక్టర్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం, ఆ ఇష్టం ఎంతంటే, చూడటం వరుకే కాదు సినిమాలలో నటించాలన్నంత మోజు. కేవలం నటించటం మాత్రమే కాదు హీరో అనిపించుకోవాలన్నంత తపన కూడా ఆయన లో ఉంది.  ఆ ముచ్చటను 'చంద్రహాస్', 'రాజేంద్ర' వంటి సినిమాలలో తీర్చుకున్నాడు. ఆయనే డాక్టర్ హరినాథ్ పొలిచర్ల. ఆయన ఇప్పుడు తాను మరో పవన్ కళ్యాణ్ లా అమెరికాలోని ఆంధ్రుల చేత ఆరాధింపబడుతున్నాడు. దీనికి కారణం ప్రస్తుతం ఆయన అమెరికాలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పవన్ సినిమాల పాటలతో స్టేజ్ షోలు ఇస్తూ ఆదరగోడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ పాటలకు హీరోయిన్స్ మధురిమా, విమలా రామన్ లాంటి బ్యూటీలను పక్కన పెట్టుకుని అచ్చు పవన్ కళ్యాణ్ లాగే డ్రెస్ వేసుకుని అదే బాడీ లాంగ్ వెజ్ ని అనుసరిస్తూ స్టేజ్ పై పవన్ పాటలకు స్టెప్స్ వేస్తూ ఉంటే అమెరికాలోని మన తెలుగు వారంతా ఆ స్టేజ్ షోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ మ్యానియా అమెరికాలోని డాక్టర్లకు కూడా తాకింది అంటే భవిష్యత్తులో హాలీవుడ్ నటులు కూడా పవన్ ను అనుకరిస్తారేమో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: